ఇండోనేసియాలో భారీ వర్షాలు.. 16 మంది మృతి

ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ఇండోనేషియా ఉక్కిరిబిక్కిరవుతోంది. భారీ వర్షాల కారణంగా చాలా గ్రామాలు నీట మునిగాయి. వందలాది మంది నిరాశ్రయులయ్యారు. ముఖ్యంగా సులవేసి ప్రావిన్సులో వ‌ర‌ద‌ల కార‌ణంగా 16 మంది మ‌ృత్యువాతపడ్డారు. భారీ వ‌ర్షాల‌కు ప‌లు గ్రామాలు నీట మునిగిన‌ట్లు స్థానిక అధికారులు వెల్లడించారు.

ఇండోనేసియాలో భారీ వర్షాలు.. 16 మంది మృతి
Follow us

|

Updated on: Jul 15, 2020 | 5:11 PM

ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ఇండోనేషియా ఉక్కిరిబిక్కిరవుతోంది. భారీ వర్షాల కారణంగా చాలా గ్రామాలు నీట మునిగాయి. వందలాది మంది నిరాశ్రయులయ్యారు. ముఖ్యంగా సులవేసి ప్రావిన్సులో వ‌ర‌ద‌ల కార‌ణంగా 16 మంది మ‌ృత్యువాతపడ్డారు. భారీ వ‌ర్షాల‌కు ప‌లు గ్రామాలు నీట మునిగిన‌ట్లు స్థానిక అధికారులు వెల్లడించారు. ఇప్పటి వరకు దాదాపు 23 మంది గ‌ల్లంత‌యిన‌ట్లు జాతీయ విప‌త్తు స‌హాయ బృందం ప్ర‌తినిధి రాదిత్య జాతి తెలిపారు. తప్పిపోయిన వారికి కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టామన్నారు. మరోవైపు, భార వ‌ర్షం కార‌ణంగా స‌హాయ‌క‌చ‌ర్య‌ల‌కు తీవ్ర అటంకం వాటిల్లుతుంద‌ని చెప్పారు.

గ‌త కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వ‌ర్షాలు సులవేసి స‌మీపంలోని మూడు న‌దులను ముంచెత్తాయి. దీంతో వేలాది మంది నిర్వాసితుల‌ను సుర‌క్షిత ప్రాంతాల‌కు త‌ర‌లిస్తున్నారు. వ‌ర‌ద‌ల కార‌ణంగా వంద‌లాది ఇళ్లు ధ్వంసం అయిన‌ట్లు గుర్తించారు. దాదాపు 4,000 మందికి పైగా ప్ర‌జ‌లు పునరావాస కేంద్రాలకు తరలించినట్లు ఉత్త‌ర లువు జిల్లా క‌లెక్ట‌ర్ ఇందాపుత్రి పేర్కొన్నారు. వ‌ర‌ద ఉదృతికి విమానాశ్రయం రన్ వే స‌హా ర‌హ‌దారి ప్రాంతాలు దెబ్బ‌తిన్నాయ‌ని వివ‌రించారు. ఈ ఏడాది జ‌న‌వరిలోనూ భారీ వ‌ర్షాల కార‌ణంగా ఇండోనేషియాలో 66 మంది మృతిచెందారు. దీంతో ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ ట్వీట్టర్ లో పేర్కొన్నారు.