పెద్ద అంబర్‌పేట్ ఔటర్ రింగురోడ్డు వద్ద రోడ్డు ప్రమాదం…రెండు కార్లను ఢీ కొట్టిన లారీ.. ఐదుగురకి తీవ్ర గాయాలు..!

Narender Vaitla

Narender Vaitla |

Updated on: Dec 31, 2020 | 12:01 AM

ఔటర్ రింగ్ రోడ్డు వద్ద వేగంగా వ‌చ్చిన లారీ రెండు కార్లను ఢీకొట్టింది. దీంతో ఐదుగురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు.

పెద్ద అంబర్‌పేట్ ఔటర్ రింగురోడ్డు వద్ద రోడ్డు ప్రమాదం...రెండు కార్లను ఢీ కొట్టిన లారీ.. ఐదుగురకి తీవ్ర గాయాలు..!

ORR road accident:హైదరాబాద్ మహానగర శివారులోని ఓ లారీ బీభత్సం సృష్టించింది. విజయవాడ – హైదరాబాద్ జాతీయ రోడ్డులోని ఔటర్ రింగ్ రోడ్డు వద్ద వేగంగా వ‌చ్చిన లారీ రెండు కార్లను ఢీకొట్టింది. దీంతో ఐదుగురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. పెద్దఅంబర్ పేట్ మున్సిపాలిటీ పరిధిలోని ఔటర్ రింగ్ రోడ్డు వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. జాతీయ రహదారిపై అతి వేగంగా వచ్చిన సిమెంట్ కాంక్రీట్ మిక్సర్ లారీ రెండు కార్లను వెనుక నుంచి ఢీకొట్టింది. దీంతో రెండు కార్లు రోడ్డు ప్రక్కన ఉన్న శీతాకాల దుప్పట్లు అమ్మే దుకాణంలోకి దూసుకెళ్లింది. దీంతో రెండు పూర్తిగా ధ్వంసం కాగా, ఐదుగురు వ్యక్తులకు గాయాలయ్యారు. స్థానికుల సమాచారం మేరకు ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదానికి కారణమైన లారీ డ్రైవ‌ర్‌పై కేసు న‌మోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

ఇదీ చదవండి…

హైదరాబాద్‌ రౌడీషీటర్లపై నగర పోలీసులు నిఘా.. పాతబస్తీలో ఇళ్లకు వెళ్లి తనిఖీ చేసిన డీసీపీ

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu