ఇదేం చేప బాబోయ్ ! అచ్ఛం మనిషి ఫేస్.. రేర్ సీన్ !

చైనాలోని ఓ కుగ్రామంలో దారంట వెళ్తున్న ఓ యువతికి చెరువులో ఒక చేప కనబడి తన కళ్ళను తానే నమ్మలేకపోయింది. కారణం ? ఆ చేప తల అచ్ఛంమనిషి ముఖం మాదిరే ఉంది. మనిషి నోరు, ముక్కు, కళ్ళ రూపు కలిగిన అది నీటిలో ఈదడం చూసి ఆమె షాక్ తింది. ఇలాంటి అరుదైన చేపను ఎప్పుడూ చూడలేదని అంటూ దీని తాలూకు వీడియోను తన ఫేస్ బుక్ లో పోస్ట్ చేసింది. కేవలం 17 సెకండ్ల […]

ఇదేం చేప బాబోయ్ ! అచ్ఛం మనిషి  ఫేస్.. రేర్ సీన్ !
Follow us
Anil kumar poka

|

Updated on: Nov 10, 2019 | 2:28 PM

చైనాలోని ఓ కుగ్రామంలో దారంట వెళ్తున్న ఓ యువతికి చెరువులో ఒక చేప కనబడి తన కళ్ళను తానే నమ్మలేకపోయింది. కారణం ? ఆ చేప తల అచ్ఛంమనిషి ముఖం మాదిరే ఉంది. మనిషి నోరు, ముక్కు, కళ్ళ రూపు కలిగిన అది నీటిలో ఈదడం చూసి ఆమె షాక్ తింది. ఇలాంటి అరుదైన చేపను ఎప్పుడూ చూడలేదని అంటూ దీని తాలూకు వీడియోను తన ఫేస్ బుక్ లో పోస్ట్ చేసింది. కేవలం 17 సెకండ్ల పాటు ఉన్న ఈ వీడియో చూసిన వారంతా తలో రకంగా స్పందించారు. అసలది చేపేనా ? లేక ఆ యువతి ఏదో ‘ మాయాజాలం ‘ చేసి.. మార్ఫింగ్ తో ఈ వీడియోను రూపొందించిందా అని కొందరు అంటే.. అది నిజమైన మత్స్యమేనని, ఇలాంటివి చాలా అరుదుగా ఉంటాయని మరికొంతమంది ఆమెను వెనకేసుకొచ్చారు. మరి.. మనమూ చూసేద్దామా ? https://twitter.com/Unexplained/status/1192886685434023938