ప్రారంభమైన అమర్‌నాథ్ యాత్ర
అమర్ నాథ్ యాత్ర ప్రారంభమైంది. జమ్ము బేస్ క్యాంపు నుంచి తెల్లవారుజామునే అమర్ నాథ్ యాత్రికుల తొలిబృందం బయలు దేరింది. జమ్ముకశ్మీర్ గవర్నర్ సత్యపాల్ మాలిక్ సలహాదారుడు కేకే శర్మ జెండా ఊపి ప్రారంభించారు. భంభం భోలే నినాదాలతో భక్తులు ఆ పరమశివుడిని నామాన్ని స్మరిస్తూ.. యాత్ర ప్రారంభమైంది. యాత్రికులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఉగ్ర హెచ్చిరకల నేపథ్యంలో పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా తాము ఎటువంటి ప్రమాదానికైనా […]
అమర్ నాథ్ యాత్ర ప్రారంభమైంది. జమ్ము బేస్ క్యాంపు నుంచి తెల్లవారుజామునే అమర్ నాథ్ యాత్రికుల తొలిబృందం బయలు దేరింది. జమ్ముకశ్మీర్ గవర్నర్ సత్యపాల్ మాలిక్ సలహాదారుడు కేకే శర్మ జెండా ఊపి ప్రారంభించారు. భంభం భోలే నినాదాలతో భక్తులు ఆ పరమశివుడిని నామాన్ని స్మరిస్తూ.. యాత్ర ప్రారంభమైంది. యాత్రికులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఉగ్ర హెచ్చిరకల నేపథ్యంలో పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా తాము ఎటువంటి ప్రమాదానికైనా భయపడేది లేదన్నారు భక్తులు. కాగా యాత్ర జరిగే మార్గంలో అడుగడుగునా సైన్యం పహారా కొనసాగుతోంది. 46 రోజుల పాటు ఈ యాత్ర కొనసాగనుంది. ఇటీవలే కేంద్ర హోంమంత్రి అమిత్ షా అమర్‌నాథుడిని దర్శించుకున్నారు. అనంతరం రెండు రోజుల పాటు జమ్ముకశ్మీర్‌లో పర్యటించారు. ఈ సందర్భంగా అమర్‌నాథ్ యాత్ర భద్రతా ఏర్పాట్లపై అధికారులతో సమీక్షించారు.
Jammu: First batch of Amarnath Yatra flagged off from Jammu base camp by KK Sharma, Advisor to the Governor Satya Pal Malik, amidst tight security. #JammuAndKashmir pic.twitter.com/aMO8dMp60x
— ANI (@ANI) June 29, 2019