రేపు తెరుచుకోనున్న బాబ్లీ ప్రాజెక్టు గేట్లు

ఉత్తర తెలంగాణ జిల్లాలోని ఆయకట్టుకు సాగునీరు అందబోతుంది. నిజామాబాద్ సరిహద్దులో ఉన్న బాబ్లీ ప్రాజెక్టు గేట్లు రేపు తెరుచుకోనున్నాయి. ప్రతి ఏడాది జూలై 1 నుంచి అక్టోబర్ 28 వరకు ఈ గేట్లను ఎత్తి ఉంచాలని గతంలో సుప్రీం కోర్టు తీర్పు వెలువరించిన నేపధ్యంలో రేపు ఈ గేట్లు ఎత్తనున్నారు. కేంద్ర జలవనరుల శాఖ అధికారుల సమక్షంలో ప్రాజెక్టు గేట్లు ఎత్తేందుకు మహారాష్ట్ర,తెలంగాణ ప్రభుత్వాలు రెడీ అయ్యాయి. మహారాష్ట్రలో భారీ వర్షాలు కురిస్తేనే బాబ్లీ ప్రాజెక్టులో నీరు […]

రేపు తెరుచుకోనున్న బాబ్లీ ప్రాజెక్టు గేట్లు
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Jun 30, 2019 | 11:23 AM

ఉత్తర తెలంగాణ జిల్లాలోని ఆయకట్టుకు సాగునీరు అందబోతుంది. నిజామాబాద్ సరిహద్దులో ఉన్న బాబ్లీ ప్రాజెక్టు గేట్లు రేపు తెరుచుకోనున్నాయి. ప్రతి ఏడాది జూలై 1 నుంచి అక్టోబర్ 28 వరకు ఈ గేట్లను ఎత్తి ఉంచాలని గతంలో సుప్రీం కోర్టు తీర్పు వెలువరించిన నేపధ్యంలో రేపు ఈ గేట్లు ఎత్తనున్నారు. కేంద్ర జలవనరుల శాఖ అధికారుల సమక్షంలో ప్రాజెక్టు గేట్లు ఎత్తేందుకు మహారాష్ట్ర,తెలంగాణ ప్రభుత్వాలు రెడీ అయ్యాయి.

మహారాష్ట్రలో భారీ వర్షాలు కురిస్తేనే బాబ్లీ ప్రాజెక్టులో నీరు నిండుతుంది. దీనివల్లే ఎస్పారెస్పీలోకి నీరు వచ్చి చేరే పరిస్థితి ఉంది. బాబ్లీ ప్రాజెక్టుల గేట్లు ఎత్తడంతో ఉత్తర తెలంగాణ జిల్లాలైన ఆదిలాబాద్,కరీంనగర్, వరంగల్,నిజామాబాద్ జిల్లాలలోని ఆయుకట్టుకు సాగునీరు అందుతుంది.

జలవనరుల సద్వినియోగానికి పొరుగు రాష్ట్రాలతో స్నేహపూరితంగా అడుగులు వేస్తున్నారు సీఎం కేసీఆర్. ప్రతిష్టాత్మక కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి కావడానికి మహారాష్ట్ర ప్రభుత్వం ఎంతో సహకరించిందని సీఎం చెప్పడమే దీనికి ఉదాహరణ. మరోవైపు బాబ్లీ గేట్లు ఎత్తనుండటంతో ఉత్తర తెలంగాణకు నీటి ఇక్కట్లు తీరినట్టేనని రైతులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.