చత్తీస్ గడ్: ఆర్మీ క్యాంపులో కాల్పుల కలకలం!

చత్తీస్ గడ్ లోని బీజాపూర్ జిల్లా CAF క్యాంపు లో కాల్పుల కలకలం రేగింది. జవాన్ల మధ్య ఏర్పడ్డ వివాదంతో తోటి జవాన్లపై దయాశంకర్ శుక్లా అనే జవాను కాల్పులు జరిపాడు. దీంతో ఒకరు మృతి చెందగా, మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. కాల్పులు జరిపిన అనంతరం దయాశంకర్ ఆత్మహత్య యత్నం చేసినట్లు అధికారులు తెలిపారు. ఈ కాల్పుల్లో రవిరంజన్ అనే జవాను అక్కడికక్కడే మృతి చెందాడు. మొహమ్మద్ షరీఫ్ అనే జవాను తీవ్రంగా […]

చత్తీస్ గడ్: ఆర్మీ క్యాంపులో కాల్పుల కలకలం!

చత్తీస్ గడ్ లోని బీజాపూర్ జిల్లా CAF క్యాంపు లో కాల్పుల కలకలం రేగింది. జవాన్ల మధ్య ఏర్పడ్డ వివాదంతో తోటి జవాన్లపై దయాశంకర్ శుక్లా అనే జవాను కాల్పులు జరిపాడు. దీంతో ఒకరు మృతి చెందగా, మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. కాల్పులు జరిపిన అనంతరం దయాశంకర్ ఆత్మహత్య యత్నం చేసినట్లు అధికారులు తెలిపారు. ఈ కాల్పుల్లో రవిరంజన్ అనే జవాను అక్కడికక్కడే మృతి చెందాడు. మొహమ్మద్ షరీఫ్ అనే జవాను తీవ్రంగా గాయపడ్డాడు. క్షయతగాత్రులను బీజాపూర్ ఆసుపత్రికి తరలించినట్లు బస్తర్ ఐజీ సుందర్ రాజ్ తెలిపారు.

[svt-event date=”01/02/2020,10:55PM” class=”svt-cd-green” ]

[/svt-event]

Published On - 11:10 pm, Sat, 1 February 20

Click on your DTH Provider to Add TV9 Telugu