ముంబై క్వారంటైన్ సెంటర్ లో అగ్నిప్రమాదం..
కోవిద్-19 మహమ్మారి భారత్ లోనూ ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. దేశమంతా కరోనా కర్ఫ్యూ కొనసాగుతోంది. ముంబైలోని ఓ క్వారంటైన్ కేంద్రంలో అగ్నిప్రమాదం జరిగింది. 5 ఫైర్ ఇంజన్లు, నాలుగు జంబో ట్యాంకర్లతో

కోవిద్-19 మహమ్మారి భారత్ లోనూ ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. దేశమంతా కరోనా కర్ఫ్యూ కొనసాగుతోంది. ముంబైలోని ఓ క్వారంటైన్ కేంద్రంలో అగ్నిప్రమాదం జరిగింది. 5 ఫైర్ ఇంజన్లు, నాలుగు జంబో ట్యాంకర్లతో అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పుతున్నారు. కోవిడ్ -19 క్వారంటైన్ కేంద్రంగా పనిచేస్తున్న ముంబై హోటల్‌లో మంటలు చెలరేగాయి.
వివరాల్లోకెళితే.. ముంబైలోని నాగపాద ప్రాంతంలో ఉన్న క్వారంటైన్ కేంద్రంలో అగ్నిప్రమాదం జరిగినట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదని వైద్యులు పేర్కొన్నారు. మూడు అంతస్తుల భవనంలో క్వారంటైన్ సెంటర్ ఉందని, ఇందులో పలు ప్రాంతాలకు చెందిన బాధితులు ఉన్నట్లు అగ్నిమాపక ప్రధాన అధికారి తెలిపారు. తప్పిపోయిన వారి కోసం ఆపరేషన్ కొనసాగుతోందని, మరిన్ని వివరాల కోసం వేచిచూడాల్సి ఉందని అధికారి వెల్లడించారు.
[svt-event date=”21/04/2020,8:42PM” class=”svt-cd-green” ]
Mumbai: Fire under control at Rippon Hotel on Bellasis Road in Nagpada. Total 27 people including 25 patients and 2 staff rescued; cooling operation on https://t.co/AzgStKFAAJ
— ANI (@ANI) April 21, 2020
[/svt-event]



