ఐడీఏ బొల్లారంలో భారీ అగ్ని ప్రమాదం.. పేలిన కెమికల్ ఫ్యాక్టరీ రియాక్టర్లు.. 8 మందికి కార్మికులు గాయాలు
ఐడీఏ బొల్లారం పారిశ్రామికవాడలోని వింధ్యా ఆర్గానిక్ పరిశ్రమలో శనివారం మధ్యాహ్నం అగ్నిప్రమాదం సంభవించింది. మంటలు చెలరేగడంతో కార్మికులు తీవ్ర భయాందోళనకు గురై పరిశ్రమ నుంచి బయటకు పరుగులు తీశారు. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటానస్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు.
ఐడీఏ బొల్లారం పారిశ్రామికవాడలోని వింధ్యా ఆర్గానిక్ పరిశ్రమలో శనివారం మధ్యాహ్నం అగ్నిప్రమాదం సంభవించింది. మంటలు చెలరేగడంతో కార్మికులు తీవ్ర భయాందోళనకు గురై పరిశ్రమ నుంచి బయటకు పరుగులు తీశారు. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటానస్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు.
వింధ్యా ఆర్గానిక్ కంపెనీలో ఒక్కసారిగా పేలుడు సంభవించింది. పరిశ్రమలో మొత్తం 3 బ్లాకులు కాగా, మొదటి బ్లాక్‌లో ప్రమాదం జరిగింది. ప్రమాదం జరిగినప్పుడు రెండు రీయాక్టర్లు బ్లాస్ట్ అయ్యాయి. ఒక్కసారిగా రెండు రీయాక్టర్లు బ్లాస్ట్ కావడంతో భవనం మొత్తం నేలమట్టం అయ్యింది. రియాక్టర్ పేలిపోయిందని భావించిన కార్మికులు ఒక్కసారిగా పరుగులు పెట్టారు. మరికొందరు కార్మికులు ఫ్యాక్టరీలోనే చిక్కుకుపోయారు. ఈ ప్రమాదంలో 8 మందికి కార్మికులు గాయాలయ్యాయి. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను బాచుపల్లిలో మమతా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అగ్ని ప్రమాదంలో గాయపడిన వారిని వెంకటేశ్, రిషికేశ్ కుమార్, ఈరేశ్ రేష్మా, శ్రీకృష్ణ, విద్యాభాన్ సింగ్, రాజా రావు, రజినీ, ఆనంది పార్థీలుగా గుర్తించారు. పేలుడు ధాటికి పరిశ్రమ పైకప్పులు ఎగిరిపోయాయి. చుట్టుపక్కల ఫ్యాక్టరీ అద్దాలు పగిలిపోయాయి. ఫ్యాక్టరీ చుట్టూ దట్టమైన పొగలు అలుముకున్నాయి. ఐదు ఫైరింజన్లు రంగంలోకి దిగి మంటలను అదుపులోకి తీసుకువచ్చాయి.
ముందు ఒక రియాక్టర్ పేలి పక్కనున్న రియాక్టర్‌కు మంటలు అంటుకున్నాయి. వెంటనే చుట్టుపక్కల పరిశ్రమల నుంచి కార్మికులను ఖాళీ చేయించారు. మంటలు ఇతర పరిశ్రమలకు అంటుకోకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. చుట్టుపక్కల పరిశ్రమల్లోని రియాక్టర్లను చల్లబరిచారు. పారిశ్రామిక ప్రాంతంలో తరుచూ ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. నగర శివారులో దాదాపు 1,500 రసాయన పరిశ్రమలు ఉన్నా..కనీస సదుపాయాలు లేవని వాపోయారు. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసిన అధికారులు దర్యాప్తు చేపట్టారు.