చిరు ఫాంహౌజ్‌లో తగలబడుతున్న ‘సైరా’ సెట్..!
టాలీవుడ్ ప్రముఖ నటుడు మెగాస్టార్ చిరంజీవి ఫాంహౌజ్‌లో అగ్నిప్రమాదం సంభవించింది. రంగారెడ్డి జిల్లా గండిపేట కోకాపేట్‌లోని ఫాంహౌజ్‌లో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఆ సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ‘సైరా నరసింహా రెడ్డి’ సినిమా కోసం వేసిన సెట్టింగ్.. మంటల్లో తగలబడుతోంది. సినిమా సెట్ దాదాపు బూడిదైనట్టు తెలుస్తోంది. దీంతో.. కోట్లాది రూపాయల నష్టం వాటిల్లినట్టు సమాచారం. ఫాంహౌజ్ నుంచి దట్టమైన పొగ, మంటలు […]

టాలీవుడ్ ప్రముఖ నటుడు మెగాస్టార్ చిరంజీవి ఫాంహౌజ్‌లో అగ్నిప్రమాదం సంభవించింది. రంగారెడ్డి జిల్లా గండిపేట కోకాపేట్‌లోని ఫాంహౌజ్‌లో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఆ సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ‘సైరా నరసింహా రెడ్డి’ సినిమా కోసం వేసిన సెట్టింగ్.. మంటల్లో తగలబడుతోంది. సినిమా సెట్ దాదాపు బూడిదైనట్టు తెలుస్తోంది. దీంతో.. కోట్లాది రూపాయల నష్టం వాటిల్లినట్టు సమాచారం. ఫాంహౌజ్ నుంచి దట్టమైన పొగ, మంటలు చెలరేగడంతో స్థానికులు గమనించి అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. కాగా.. అగ్ని ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.



