నాకెన్ని ఓట్లు పడ్డాయో చూసి చెప్పు, లేకపోతే, జార్జియా అధికారికి ట్రంప్ హుకుం, గంటసేపు ‘వేధింపులు’

Umakanth Rao

Umakanth Rao | Edited By: Balu

Updated on: Jan 04, 2021 | 1:44 PM

అమెరికా ఎన్నికల్లో తన ఓటమిని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇప్పటికీ  ఒప్పుకోవడంలేదు. ఇందుకు ఉదాహరణగా శనివారం ఆయన జార్జియాలో...

నాకెన్ని ఓట్లు పడ్డాయో చూసి చెప్పు, లేకపోతే, జార్జియా అధికారికి ట్రంప్ హుకుం, గంటసేపు 'వేధింపులు'

అమెరికా ఎన్నికల్లో తన ఓటమిని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇప్పటికీ  ఒప్పుకోవడంలేదు. ఇందుకు ఉదాహరణగా శనివారం ఆయన జార్జియాలో సాక్షాత్తూ తన రిపబ్లికన్ సభ్యుడైన బ్రాడ్ రాఫెన్స్పర్జర్  తో గంట సేపు ఫోన్ లో మాట్లాడిన ఉదంతమే.. ఈ సందర్భంగాఆయన.. ఈ ఎన్నికలు ఫ్రాడ్ అని, బ్యాలెట్స్ అండర్ టేబుల్ స్కామ్ అని, బ్యాలట్ డిస్ట్రక్షన్ అని, డెడ్ ఓటర్స్ అని..ఇలా రకరకాలుగా ఎన్నికలను ‘తిట్టిపోశాడు’. జార్జియాలో తనదే గెలుపని, ఓట్లను తిరిగి లెక్కించేలా చూడాలని బ్రాడ్ ని పదేపదే కోరాడు. ఒక సందర్భంలో కాస్త కోపంగా బెదిరించడం, మరో సందర్భంలో ప్రాధేయపడడం, .. చేశాడు. ఈ ఎన్నికల్లో ఇంకా ఎన్నో అవకతవకలు జరిగాయని, తనకు క్లూ లేదని ‘పాపం’ విచారం కూడా వ్యక్తం చేశాడు. అధ్యక్షుడు కానున్న జో బైడెన్ కి ఈ రాష్ట్రంలో 11,779  ఓట్లు వచ్చాయని బ్రాడ్ చెప్పగా తనకు 11,780 ఓట్లు వచ్చాయేమో చూడాలని ఈయన కోరాడట. ఈ రాష్ట్రంలో తనదే గెలుపని అన్నాడు.

ట్రంప్ సాగించిన ఈ గంట సేపు సంభాషణ తాలూకు రికార్డింగ్ వాషింగ్టన్ పోస్ట్ కి లభ్యమైంది. అయితే ట్రంప్ సార్ బెదిరింపులకు బ్రాడ్ లొంగలేదు. ఏ మాత్రం తడబడకుండా ఇక్కడ బైడెన్ దే విజయమని చెబుతూ వచ్చారు. కాగా అధ్యక్షుడి ఈ బెదిరింపులు, బతిమాలాడాలు అధికార దుర్వినియోగమేనని, క్రిమినల్ చర్య అని లీగల్ నిపుణులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu