AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

డిసెంబర్​ 8న భారత్​ బంద్​, ప్రభుత్వంతో చర్చలు కొలిక్కి రాకపోవడంతో రైతు సంఘాల నిర్ణయం

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా.. డిసెంబర్​ 8న భారత్​ బంద్​కు పిలుపునిచ్చాయి రైతు సంఘాలు. ఆందోళనలో భాగంగా శనివారం దేశవ్యాప్తంగా

డిసెంబర్​ 8న భారత్​ బంద్​, ప్రభుత్వంతో చర్చలు కొలిక్కి రాకపోవడంతో రైతు సంఘాల నిర్ణయం
Ram Naramaneni
|

Updated on: Dec 05, 2020 | 10:49 AM

Share

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా.. డిసెంబర్​ 8న భారత్​ బంద్​కు పిలుపునిచ్చాయి రైతు సంఘాలు. ఆందోళనలో భాగంగా శనివారం దేశవ్యాప్తంగా ప్రధాని నరేంద్ర మోదీ దిష్టిబొమ్మలను దహనం చేయాలని పిలుపునిచ్చారు. దేశ రాజధాని ఢిల్లీకి దారితీసే రహదారులన్నింటినీ దిగ్బంధం చేస్తామని హెచ్చరించారు అన్నదాతలు. కేంద్ర ప్రభుత్వంతో జరుపుతున్న చర్చలు కొలిక్కి రాకపోవడంతో తాజా నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

కొత్త చట్టాలపై రైతు సంఘాలు, కేంద్రం ఇప్పటికే నాలుగు విడతల్లో చర్చలు జరిపినప్పటికీ అవి కొలిక్కిరాలేదు. సాగు చట్టాలపై ప్రభుత్వం ఇచ్చిన వివరణను రైతులు తిరస్కరించారు. చట్టాలు.. రైతు వ్యతిరేకమని, వాటిని తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు. ఇవాళ్టి చర్చల్లో కేంద్రం.. తమ డిమాండ్లను అంగీకరించకపోతే ఆందోళనలు మరింత ఉద్ధృతం చేస్తామని రైతులు హెచ్చరిస్తున్నారు.

మరోవైపు.. అన్నదాతలు చేపట్టిన ఆందోళన వ్యవహారం సుప్రీం కోర్టుకు చేరింది. రైతుల నిరసనతో కరోనా వేగంగా వ్యాప్తి చెందే ప్రమాదం ఉన్నందున వారిని వెంటనే అక్కడి నుంచి ఖాళీ చేయించాలని కోరుతూ పిటిషన్​ దాఖలైంది. అంతేకాకుండా సరిహద్దుల్లో రైతులు బైఠాయించడంతో ఆ మార్గాల్లో రాకపోకలు నిలిచిపోయాయని, దీని వల్ల అత్యవసర వైద్య సేవలకు అంతరాయం కలుగుతోందని పిటిషనర్‌ ఆరోపించారు. ఐతే రైతు ఉద్యమంపై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైన వేళ.. రైతులు తమ ఆందోళనను తీవ్రతరం చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.

Also Read :

Concussion Substitute : కంకషన్​ సబ్​స్టిట్యూట్​ అంటే ఏంటి? దాని కోసం రూపొందించిన నియమాలు ఏంటి?

బీజేపీ రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి ఇంట తీవ్ర విషాదం, ఎంపీకి ప్రముఖుల పరామర్శ

రెండు కోట్లు లేవు అన్నవారికి 26 బంతుల్లోనే సమాధానం చెప్పాడు
రెండు కోట్లు లేవు అన్నవారికి 26 బంతుల్లోనే సమాధానం చెప్పాడు
క్రిస్మస్ పర్వదినాన కాలిఫోర్నియాను ముంచెత్తిన వరదలు
క్రిస్మస్ పర్వదినాన కాలిఫోర్నియాను ముంచెత్తిన వరదలు
సీన్ గురించి చెప్పాలని గదిలోకి అలా ప్రవర్తించాడు..
సీన్ గురించి చెప్పాలని గదిలోకి అలా ప్రవర్తించాడు..
ఈజీగా డబ్బులు వస్తాయనుకున్నాడు.. కానీ చివరకు ఇలా బలైపోయాడు..
ఈజీగా డబ్బులు వస్తాయనుకున్నాడు.. కానీ చివరకు ఇలా బలైపోయాడు..
శ్రేయస్ అయ్యర్ రిటర్న్ గిఫ్ట్.. నెట్స్‌లో బ్యాటింగ్ షురూ
శ్రేయస్ అయ్యర్ రిటర్న్ గిఫ్ట్.. నెట్స్‌లో బ్యాటింగ్ షురూ
చివరిశనివారం-ఈ పరిహారాలతో వచ్చే ఏడాది పొడవునా డబ్బుకు కొరత ఉండదు!
చివరిశనివారం-ఈ పరిహారాలతో వచ్చే ఏడాది పొడవునా డబ్బుకు కొరత ఉండదు!
అతడంటే పిచ్చి.. క్రష్ ఎవరో చెప్పిన కాజల్..
అతడంటే పిచ్చి.. క్రష్ ఎవరో చెప్పిన కాజల్..
2026లో మీ అదృష్టాన్ని మార్చే ప్రత్యేక ఉపవాసాలు!సంపన్న జీవితం కోసం
2026లో మీ అదృష్టాన్ని మార్చే ప్రత్యేక ఉపవాసాలు!సంపన్న జీవితం కోసం
రైతులకు గుడ్‌న్యూస్.. ఇక దళారుల టెన్షన్ లేనట్టే..
రైతులకు గుడ్‌న్యూస్.. ఇక దళారుల టెన్షన్ లేనట్టే..
పిల్లల్ని కంటే ప్రోత్సాహకాలు.. జనాభా పెంచడానికి ప్రభుత్వం ప్లాన్
పిల్లల్ని కంటే ప్రోత్సాహకాలు.. జనాభా పెంచడానికి ప్రభుత్వం ప్లాన్