రైళ్లను మళ్లించిన, కుదించిన రైల్వే శాఖ… రైతుల ఆందోళనలు, దిగ్బంధం నేపథ్యంలో పలు రైళ్లు రద్దు..
పంజాబ్, హరియానా రైతులు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా వారం రోజులుగా ఆందోళనలు చేస్తున్నారు. రైతులు ఇప్పటికే పంజాబ్, ఢిల్లీ రాష్ట్రంలోని ప్రధాన రహదారులు, రైల్వే లైన్లను దిగ్బంధించారు.
Farmers’ stir: Railways diverts, short terminates trains in Punjab పంజాబ్, హరియానా రైతులు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా వారం రోజులుగా ఆందోళనలు చేస్తున్నారు. రైతులు ఇప్పటికే పంజాబ్, ఢిల్లీ రాష్ట్రంలోని ప్రధాన రహదారులు, రైల్వే లైన్లను దిగ్బంధించారు. ప్రభుత్వం అన్నదాతలతో మూడు రోజులుగా చర్చలు జరుపుతోంది.
అమృత్‌సర్ – ముంబై స్పెషల్ ట్రైన్ దారి మళ్లింపు…
రైతుల ఆందోళనల నేపథ్యంలో పశ్చిమ రైల్వే పలు రైళ్లను కుదించింది. మరికొన్ని రైళ్లను దారి మళ్లించింది. ఇంకొన్ని రైళ్లను రద్దు చేసింది. బాంద్రా టెర్మినల్ నుంచి అమృత్‌సర్ మధ్య నడిచే స్పెషల్ ట్రైన్ ను పశ్చిమ రైల్వే కుదించింది. అమృత్‌సర్ వెళ్లాల్సిన ట్రైన్ ను చంఢీఘర్ వరకే నడపనుంది. అదే విధంగా అమృత్‌సర్ నుంచి బాంద్రా వెళ్లాల్సిన ట్రైన్ ను సైతం కుదించింది. అమృత్ సర్ – ముంబై ట్రైన్ ను సైతం రైల్వే శాఖ దారి మళ్లించింది.