ప్రముఖ సీనియ‌ర్ న‌టి ఇంట్లో విషాదం.. జయచిత్ర భర్త గణేష్ గుండెపోటుతో మృతి

సినీ పరిశ్రమలో మరో విషాదం చోటుచేసుకుంది. న‌టి, ద‌ర్శ‌కనిర్మాత జ‌య‌చిత్ర భ‌ర్త గ‌ణేష్‌(62) అనారోగ్యంతో కన్నుమూశారు. తమిళనాడు రాష్ట్రంలోని తిరుచ్చిలో గణేష్ గుండెపోటుతో క‌న్ను ‌మూశారు

ప్రముఖ సీనియ‌ర్ న‌టి ఇంట్లో విషాదం.. జయచిత్ర భర్త గణేష్ గుండెపోటుతో మృతి
Follow us
Balaraju Goud

| Edited By: Shiva Prajapati

Updated on: Dec 05, 2020 | 10:00 AM

సినీ పరిశ్రమలో మరో విషాదం చోటుచేసుకుంది. న‌టి, ద‌ర్శ‌కనిర్మాత జ‌య‌చిత్ర భ‌ర్త గ‌ణేష్‌(62) అనారోగ్యంతో కన్నుమూశారు. తమిళనాడు రాష్ట్రంలోని తిరుచ్చిలో గణేష్ గుండెపోటుతో క‌న్ను ‌మూశారు. 1983లో గ‌ణేష్‌ని వివాహమాడింది జయచిత్ర. ఈ దంపతుల సంతానమే యువ సంగీత దర్శకుడు అమ్రేష్. గణేశ్‌ నటుడిగా ఓ చిత్రంలో నటించారు. ఆయ‌న‌ మ‌ృతిపట్ల పలువురు సినీ ప్రముఖుు సంతాపం తెలియజేశారు. గణేష్‌ను క‌డ‌సారి చూసేందుకు జ‌య‌చిత్ర అభిమానులు భారీగా తరలివస్తున్నారు. గ‌ణేష్ అంత్య‌క్రియ‌లు ఇవాళ సాయంత్రం నిర్వ‌హించ‌నున్నట్లు కుటుంబసభ్యలు తెలిపారు.

గ‌ణేష్ భౌతికకాయాన్ని చెన్నైలోని పోయెస్‌ గార్డెన్‌లో ఉంచ‌గా, ఆయ‌న పార్థివదేహానికి పలువురు సినీ ప్రముఖులు నివాళులర్పించారు. జ‌య‌చిత్ర తెలుగునాట జన్మించినా తమిళనాడులో నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. తెలుగు, త‌మిళ భాషల‌లో 200కి పైగా చిత్రాల‌లో న‌టించారు జ‌యచిత్ర‌.