66 మిలియన్లకు చేరనున్న కరోనా కేసులు.. మరణాలు పదిహేను లక్షలకు పైగానే… కొనసాగుతున్న కరోనా ఉధృతి…
కరోనా ప్రభావం మానవాళిపై కొనసాగుతూనే ఉంది. 2019లో మొదలైన కరోనా వ్యాధి క్రమక్రమంగా వ్యాపిస్తూ... ప్రపంచ దేశాలన్నింటికీ పాకింది. ఆ మహమ్మారి కాటు ఇంకా కొనసాగుతోంది.
కరోనా ప్రభావం మానవాళిపై కొనసాగుతూనే ఉంది. 2019లో మొదలైన కరోనా వ్యాధి క్రమక్రమంగా వ్యాపిస్తూ… ప్రపంచ దేశాలన్నింటికీ పాకింది. ఆ మహమ్మారి కాటు ఇంకా కొనసాగుతోంది. వివిధ దేశాల్లో కోవిడ్ రెండో, మూడో దశలోకి ప్రవేశించి తన వ్యాప్తిని కొనసాగిస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో కరోనా కేసుల మొత్తం సంఖ్య 6, 58,42,942 కు చేరింది. మొత్తం మరణాల సంఖ్య 15,18, 560కి చేరింది.
యూఎస్ అగ్రస్థానంలో…
ప్రపంచ వ్యాప్తంగా వైరస్ వ్యాప్తి చెందిన దేశాల జాబితాలో అమెరికా ప్రథమ స్థానంలో ఉంది. అక్కడ కరోనా కేసులు 1,43,53,740 నమోదు కాగా, మరణాలు 2,79,726 నమోదయ్యాయి. రెండు, మూడు స్థానాల్లో భారత్, బ్రెజిల్ ఉన్నాయి. కాగా భారత్ లో 95,71,559, బ్రెజిల్ లో 65,33,968 కేసులు నమోదయ్యాయి.