వృధ్ద రైతును సీఆర్పీఎఫ్ జవాను లాఠీతో కొట్టాడా ? లేదా ? వైరల్ అవుతున్న వీడియో , ఏది నిజం ?
రైతుల ఆందోళన సందర్భంగా ఓ వృధ్ద రైతును సి ఆర్ పీ ఎఫ్ జవాను ఒకరు లాఠీతో బాదుతున్నట్టు కనిపించిన వీడియో వైరల్ అవుతోంది. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ సహా పలువురు ఈ పార్టీ నేతలు దీన్ని తమ ట్వీట్లలో..
రైతుల ఆందోళన సందర్భంగా ఓ వృధ్ద రైతును సి ఆర్ పీ ఎఫ్ జవాను ఒకరు లాఠీతో బాదుతున్నట్టు కనిపించిన వీడియో వైరల్ అవుతోంది. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ సహా పలువురు ఈ పార్టీ నేతలు దీన్ని తమ ట్వీట్లలో హైలైట్ చేశారు. అయితే ఈ వీడియోలో ఆ రైతుకు నిజంగా లాఠీ దెబ్బలు తగిలాయా అని బీజేపీ ఐటీ సెల్ చీఫ్ అమిత్ మాలవీయ దీన్ని జాగ్రత్తగా పరిశీలించారు. ఆ అన్నదాతపై ఆ జవాను కేవలం లాఠీ ఎత్తాడనీ, ఆయన తప్పించుకుని దూరంగా తప్పించుకుని పోయాడని వెల్లడైందని తెలుస్తోంది. ఈ వీడియోలో సగ భాగమే నిజమని అమిత్ మాలవీయ పేర్కొన్నారు. ఆ రైతుకు ఎలాంటి దెబ్బలూ తగలలేదన్నారు. సుఖదేవ్ సింగ్ అనే ఈ రైతు పంజాబ్ కు చెందినవాడు. లాఠీ దెబ్బలతో తన ఒళ్ళంతా గాయాలయ్యాయని ఆయన చెప్పడం విశేషం. సింఘు బోర్డర్ వద్ద ఈ ఘటన జరిగింది.
కాగా ఈ రాహుల్ గాంధీ చేసిన ఈ ట్వీట్ ని ట్విటర్ ‘మానిప్యులేటెడ్ మీడియా’ అని అభివర్ణించింది. ఇండియాలో ఇలా జరగడం ఇదే మొదటిసారి.
Rahul Gandhi must be the most discredited opposition leader India has seen in a long long time. https://t.co/9wQeNE5xAP pic.twitter.com/b4HjXTHPSx
— Amit Malviya (@amitmalviya) November 28, 2020