Pushpa Movie: ‘పుష్ప’ చిత్ర షూటింగ్‌లో కరోనా కలకలం.? సెల్ఫ్ ఐసోలేషన్‌లో దర్శకుడు సుకుమార్.!
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కిస్తున్న చిత్రం 'పుష్ప'. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో రూపొందుతున్న..
Pushpa Movie Shooting: స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కిస్తున్న చిత్రం ‘పుష్ప’. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో రూపొందుతున్న ఈ మూవీలో రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటిస్తోంది. కోవిడ్ కారణంగా ఆగిపోయిన ఈ చిత్ర షూటింగ్ ఇటీవలే తిరిగి ప్రారంభమైంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ రాజమండ్రి దగ్గరలోనే మారేడుమిల్లిలో జరుగుతోంది. ఇదిలా ఉంటే తాజాగా కరోనా వైరస్ సెగ పుష్ప చిత్ర షూటింగ్‌ను తాకింది.
దర్శకుడు సుకుమార్ టీమ్ సభ్యుడు ఒకరు ఇటీవల కరోనాతో చనిపోయాడు. అతడు మారేడుమిల్లిలో షూటింగ్ జరుగుతున్న సమయంలో అందరితో కలిసి పని చేయడంతో ప్రస్తుతం పుష్ప షూటింగ్‌ను నిలిపేసినట్లు సమాచారం. అయితే ఆ వ్యక్తి హీరో అల్లు అర్జున్‌తో ఎక్కువగా కాంటాక్ట్ కాలేదని టాక్.
అలాగే చిత్ర యూనిట్‌లో కొంతమంది సభ్యులు కరోనా టెస్టు చేయించుకోగా.. పలువురికి పాజిటివ్ నిర్ధారణ అయినట్లు తెలుస్తోంది. దీనితో చిత్ర యూనిట్ షూటింగ్‌ను అర్ధాంతరంగా ఆపేసి హైదరాబాద్ పయనమైనట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. మరోవైపు దర్శకుడు సుకుమార్ ప్రస్తుతం సెల్ఫ్ ఐసోలేషన్‌లో ఉన్నారని.. త్వరలోనే కోవిడ్ టెస్టు చేయించుకుంటారని వినికిడి. మరి ఈ వార్తలో ఎంతవరకు నిజముందో తెలియాలంటే చిత్ర యూనిట్ నుంచి అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే.