దేశ రాజధాని ప్రజలను వణికిస్తున్న కరోనా..గత 24 గంటల్లో 3,734 పాజిటివ్ కేసులు.. పెరిగిన మరణాలు
ఢిల్లీలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 5,82,058కు చేరింది. మొత్తం మరణాల సంఖ్య 9,424కు పెరిగింది. గత 24 గంటల్లో 4,834 మంది కోలుకున్నారు. దీంతో ఢిల్లీలో ఇప్పటి వరకు కరోనా...
ప్రపంచదేశాలను పట్టి పీడిస్తున్న కరోనా మహమ్మారి ఇప్పడప్పుడే వదిలేలా కనిపించడం లేదు. చిన్నా పెద్ద అన్నీ తేడా లేకుండా అందరికి కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది. లాక్‌డౌన్, భౌతిక దూరం పాటించడం, శానిటైజర్ల వాడకం అంటూ ప్రపంచ దేశాలు నివారణ చర్యలు చేపట్టినా కరోనా కల్లోలం కొనసాగుతూనే ఉంది. కొన్ని దేశాల్లో ఇప్పటికే సెకండ్ వేవ్ కూడా మొదలైంది. రికవరీ రేటు ఎలా ఉన్నా కోవిడ్ కేసుల సంఖ్య పెరుగుదలకు అడ్డుకట్ట పడటం లేదు. వ్యాక్సిన్ వచ్చేస్తోంది అని దైర్యంగా ఉన్నా.. కోవిడ్ మరణాలు పెరుగుతున్నాయి.
కరోనా వ్యాప్తి తగ్గుముఖం పడుతూ రికవరీ రేట్ ఎక్కువుగా ఉన్న, ఉత్తరాదిన రాష్ట్రాలలో మాత్రం వ్యాప్తి సెకండ్ వేవ్ తారాస్థాయి కి చేరింది.ముఖ్యంగా ఢిల్లీ, మహారాష్ట్రలో అత్యధికంగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. పాజిటివ్ కేసులు రోజు రోజుకి పెరుగుతూ, మరణాల సంఖ్య కూడా అధికమవుతోంది. దీంతో అప్రమత్తమైన అయా రాష్ట్ర ప్రభుత్వాలు అన్ని చర్యలు చేపడుతున్నాయి.
అటు దేశ రాజధాని ఢిల్లీలో రికార్డు స్థాయిలో వైరస్ వ్యాప్తి చెందుతుంది. కోవిడ్ తీవ్రత క్రమంగా తగ్గుతున్నది. గత కొన్ని రోజులుగా కొత్తగా నాలుగు వేల లోపే కరోనా కేసులు నమోదవుతున్నాయి. బుధవారం నుంచి గురువారం వరకు గత 24 గంటల్లో 3,734 పాజిటివ్ కేసులు నమోదు కాగా 82 మరణాలు సంభవించాయి.
ఇక ఢిల్లీలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 5,82,058కు చేరింది. మొత్తం మరణాల సంఖ్య 9,424కు పెరిగింది. గత 24 గంటల్లో 4,834 మంది కోలుకున్నారు. దీంతో ఢిల్లీలో ఇప్పటి వరకు కరోనా నుంచి కోలుకున్న వారి మొత్తం సంఖ్య 5,43,514కు చేరినట్లు ఆరోగ్యశాఖ వెల్లడించింది. ప్రస్తుతం 29,120 యాక్టివ్ కేసులు ఉన్నట్లు పేర్కొంది. దీనికితోడు చలి తీవ్రత కూడా అధికంగా ఉంది. ఈ ప్రభావం కోవిడ్ వ్యాప్తికి కారణంగా మారుతోందని అధికారులు అంటున్నారు.
Delhi reports 3734 new #COVID19 cases, 4834 recoveries and 82 deaths in the last 24 hours.
Total cases 5,82,058 Total recoveries 5,43,514 Death toll 9424
Active cases 29,120 pic.twitter.com/4x5i3qPgL5
— ANI (@ANI) December 3, 2020