AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ప్రముఖ కవి దేవిప్రియ కన్నుమూత, తెలుగు సాహితీ ప్రముఖులు దిగ్భ్రాంతి

ప్రముఖ కవి, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహిత దేవిప్రియ శనివారం ఉదయం కన్నుమూశారు.  నగరంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న..

ప్రముఖ కవి దేవిప్రియ కన్నుమూత, తెలుగు సాహితీ ప్రముఖులు దిగ్భ్రాంతి
Follow us
Ram Naramaneni

|

Updated on: Nov 21, 2020 | 11:48 AM

ప్రముఖ కవి, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహిత దేవిప్రియ శనివారం ఉదయం కన్నుమూశారు. నగరంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన ఈ రోజు ఉదయం 7.10 గంటలకు తుదిశ్వాస విడిచారు. ఆసుపత్రి నుంచి ఆయన భౌతికఖాయాన్ని అల్వాల్‌లోని స్వగృహానికి తరలించారు. ఇవాళ మధ్యాహ్నం తిరుమలగిరి స్మశానవాటికలో అంత్యక్రియలు జరగనున్నాయి. ఆయన మృతి పట్ల తెలుగు సాహితీ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.  పలువురు సాహితీప్రముఖులు సంతాపం ప్రకటించి, నివాళులు అర్పించారు. తెలుగు రచనలపై అవగాహన ఉన్నవారికి దేవిప్రియను ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు.  ఐదు దశాబ్దాల పాటు ప్రముఖ పాత్రికేయుడిగా, కవిగా దేవిప్రియ సేవలందించారు.

కొంతకాలంగా షుగర్ వ్యాధితో బాధపడుతున్న దేవిప్రియ నవంబరు 6న ఆస్పత్రిలో చేరారు. అప్పటికే ఆయన ఎడమ కాలికి ఇన్‌ఫెక్షన్‌ అవ్వడంతో తొమ్మిదో తేదీన ఎమర్జెన్సీ ఆపరేషన్ చేశారు. ఆరోగ్యం నిలకడగా మారి  క్రమక్రమంగా కోలకుంటున్న సమయంలో బ్లెడ్‌లో ఇన్‌ఫెక్షన్ మొదలైంది. దీంతో‌ ఇతర ఆరోగ్య సమస్యలు ఇబ్బందిపెట్టాయిి. అవి తీవ్రమై ఈరోజు ఉదయం మరణించారు.  దేవిప్రియ అసలు పేరు షేక్‌ ఖాజా హుస్సేన్‌.  గుంటూరు జిల్లా తాడికొండలో 1949 ఆగస్టు 15వ తేదీన జన్మించారు. పలు పత్రికల్లో ఆయన కలం నుంచి జాలువారిన కార్టూన్‌ కవితలు ‘రన్నింగ్‌ కామెంట్రీ’ పాఠకలోకం మన్ననలు అందుకున్నాయి.

‘అమ్మచెట్టు’,  ‘తుఫాను తుమ్మెద’, ‘నీటిపుట్ట’, ‘చేప చిలుక’, ‘సమాజానంద స్వామి’, ‘గాలిరంగు’, ‘గరీబు గీతాలు’, ‘గంధకుటి’ తదితర కవితా సంపుటిలతో పాటు పలు రేడియో, రంగస్థల నాటికలు, సినిమా పాటలు రచించారు. ‘గాలిరంగు’ కవితా సంకలనానికి 2017లో కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం వరించింది.

Also Read :

సాయం చేస్తే మోసం..చంపుతామని బెదిరింపులు..పోలీసులను ఆశ్రయించిన వందేమాతరం

ఈమె అందంతో కుర్రకారు షేక్, రెమ్యూనరేషన్‌తో ప్రొడ్యూసర్లు షాక్ !

కోవిడ్ బారినపడ్డ జూనియర్‌ ట్రంప్‌..ప్రస్తుతం క్వారంటైన్..నో సింటమ్స్

ఈ ఫుడ్స్‌ తింటే షుగర్ లెవెల్స్ బ్యాలెన్స్ అవుతాయి..!
ఈ ఫుడ్స్‌ తింటే షుగర్ లెవెల్స్ బ్యాలెన్స్ అవుతాయి..!
మన బుర్రను పాడు చేసే పనులు ఇవే.. జాగ్రత్త పడకపోతే అంతే సంగతి
మన బుర్రను పాడు చేసే పనులు ఇవే.. జాగ్రత్త పడకపోతే అంతే సంగతి
రాయలసీమ ఎక్స్‌ప్రెస్‌లో దొంగల బీభత్సం.. ప్రయాణికులను బెదిరించి..
రాయలసీమ ఎక్స్‌ప్రెస్‌లో దొంగల బీభత్సం.. ప్రయాణికులను బెదిరించి..
తెలుగులోకి మరో కుర్ర భామ..
తెలుగులోకి మరో కుర్ర భామ..
పెళ్లికి ముందు కూతురికి షాకిచ్చిన తల్లి.. కాబోయే అల్లుడితో జంప్..
పెళ్లికి ముందు కూతురికి షాకిచ్చిన తల్లి.. కాబోయే అల్లుడితో జంప్..
పాక్‌లోనూ ఫవాద్ ఖాన్ అబీర్ గులాల్ సినిమాపై నిషేధం! కారణమిదే
పాక్‌లోనూ ఫవాద్ ఖాన్ అబీర్ గులాల్ సినిమాపై నిషేధం! కారణమిదే
వక్కలు తింటే ఇన్ని లాభాలా..? అదిరిపోయే ప్రయోజనాలు తెలిస్తే..
వక్కలు తింటే ఇన్ని లాభాలా..? అదిరిపోయే ప్రయోజనాలు తెలిస్తే..
పేడ పిచ్ మీద ప్రాక్టీస్‌తో స్టార్ బౌలర్ల దూల తీర్చిన బుడ్డోడు..
పేడ పిచ్ మీద ప్రాక్టీస్‌తో స్టార్ బౌలర్ల దూల తీర్చిన బుడ్డోడు..
ఎప్పటి వరకు పన్ను రిటర్న్ ఫైల్ చేయవచ్చు? మర్చిపోతే నష్టాలేంటి?
ఎప్పటి వరకు పన్ను రిటర్న్ ఫైల్ చేయవచ్చు? మర్చిపోతే నష్టాలేంటి?
దారితప్పి పీఎస్‌లోకి వచ్చిన చిరుత.. పోలీస్‌ తెలిగా ఏం చేశాడంటే!
దారితప్పి పీఎస్‌లోకి వచ్చిన చిరుత.. పోలీస్‌ తెలిగా ఏం చేశాడంటే!