‘అంజలి’ పాటలో అర్హ.. అదరగొట్టిన అల్లు అర్జున్‌ గారాలపట్టి.. బన్నీ స్పెషల్ అప్పియరెన్స్‌

లెజండరీ దర్శకుడు మణిరత్నం తెరకెక్కించిన అద్భుత చిత్రాల్లో అంజలి ఒకటి. రఘువరన్‌, రేవతి, ప్రభు, షాలిని, తరుణ్‌, శ్రుతీ కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రం

  • Publish Date - 11:38 am, Sat, 21 November 20 Edited By:
'అంజలి' పాటలో అర్హ.. అదరగొట్టిన అల్లు అర్జున్‌ గారాలపట్టి.. బన్నీ స్పెషల్ అప్పియరెన్స్‌


HBD Allu Arha: లెజండరీ దర్శకుడు మణిరత్నం తెరకెక్కించిన అద్భుత చిత్రాల్లో అంజలి ఒకటి. రఘువరన్‌, రేవతి, ప్రభు, షాలిని, తరుణ్‌, శ్రుతీ కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రం 1990లో విడుదల కాగా అప్పట్లో పెద్ద విజయాన్ని సాధించడంతో పాటు ఎన్నో అవార్డులను సొంతం చేసుకుంది. ఇక ఈ మూవీ కోసం మాస్ట్రో ఇళయరాజా అందించిన సంగీతాన్ని ఎవ్వరూ అంత ఈజీగా మర్చిపోలేదు. ముఖ్యంగా ఇందులోని అంజలి అంజలి అనే పాట ఇప్పటికీ ఎక్కడో ఒకచోట వినిపిస్తూనే ఉంటుంది. కాగా ఇప్పుడు అదే పాటలో మెరిశారు అల్లు అర్జున్‌, స్నేహ తనయ అల్లు అర్హ.

ఇవాళ అల్లు అర్హ పుట్టినరోజు కావడంతో ఈ వీడియోను విడుదల చేశారు. అందులో తన క్యూట్‌ క్యూట్‌ ఎక్స్‌ప్రెషన్‌లతో అర్హ ఆకట్టుకుంటోంది. ఇక ఈ వీడియోలో బన్నీ కుమారుడు అయాన్ కూడా ఉండగా.. అల్లు అరవింద్‌, అల్లు అర్జున్‌ కెమెరా అప్పియరెన్స్ ఇచ్చారు.

మరోవైపు అల్లు అర్హకు తన సోషల్ మీడియాలో విషెస్‌ చెప్పారు బన్నీ. ”మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్‌ ఆఫ్‌ ది డే మై అర్హ. నీ అమితమైన క్యూట్‌నెస్‌, నువ్వు నాకు ఇచ్చిన సంతోషానికి చాలా థ్యాంక్స్‌. నా లిటిల్ ఏంజెల్”‌ అంటూ తన కుమార్తెపై ప్రేమనంతా చాటుకున్నారు.