‘కలర్‌ ఫొటో’ను వదలుకున్న నిహారిక.. చాందిని మొదటి ఆప్షన్ కాదట

థియేటర్లు తెరుచుకోని వేళ ఓటీటీలో విడుదలై ఘన విజయం సాధించిన చిత్రాల్లో కలర్‌ ఫొటో ఒకటి. సుహాస్‌, చాందినీ, సునీల్‌, వైవా హర్ష తదితరులు కీలక పాత్రల్లో నటించిన

  • Tv9 Telugu
  • Publish Date - 9:42 am, Sat, 21 November 20
'కలర్‌ ఫొటో'ను వదలుకున్న నిహారిక.. చాందిని మొదటి ఆప్షన్ కాదట

Color Photo movie: థియేటర్లు తెరుచుకోని వేళ ఓటీటీలో విడుదలై ఘన విజయం సాధించిన చిత్రాల్లో కలర్‌ ఫొటో ఒకటి. సుహాస్‌, చాందినీ, సునీల్‌, వైవా హర్ష తదితరులు కీలక పాత్రల్లో నటించిన ఈ ప్రేమ కథకు అన్ని వర్గాల నుంచి పాజిటివ్‌ టాక్ వచ్చింది. టాలీవుడ్‌ టాప్ హీరోలు సైతం కలర్‌ ఫొటోపై ప్రశంసలు కురిపించారు. ఇదిలా ఉంటే ఈ సినిమా గురించి సందీప్‌ ఇటీవల ఓ ఆసక్తికర విషయాన్ని రివీల్ చేశారు. అదేంటంటే ఈ మూవీకి హీరోయిన్‌గా మొదటి నిహారికను అనుకున్నారట. (నేను వద్దన్నా నా టైటిల్‌ తీసుకున్నావు.. కరణ్‌ జోహార్‌పై ప్రముఖ దర్శకుడు మధుర్‌ బండార్కర్‌ ఫైర్‌)

”ఈ సినిమాకు మొదట నిహారికను సంప్రదించాము. కానీ కొన్ని సొంత కారణాల వలన నిహారిక ఈ ప్రాజెక్ట్‌ని వదులుకుంది. ఆ తరువాత చాందినిని సంప్రదించాము. దీపు పాత్రలో చాందిని జీవించింది, ఆ పాత్రకు జీవం పోసింది” అని సందీప్ చెప్పుకొచ్చారు. కాగా ఈ సినిమాను పలు భాషల్లో రీమేక్ చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు సమాచారం. (నవంబర్ 26న ఏపీలో అమూల్‌ ప్రాజెక్ట్‌ ప్రారంభం: మంత్రి సీదిరి అప్పలరాజు)

ఇదిలా ఉంటే మరోవైపు నిహారిక ప్రస్తుతం పెళ్లి పనుల్లో బిజీగా ఉంది. గుంటూరుకు చెందిన చైతన్యను నిహారిక పెళ్లాడనుంది. వీరిద్దరి వివాహం డిసెంబర్‌ 9న రాయ్‌పూర్‌లోని ప్రముఖ హోటల్‌లో జరగనుంది. ఈ క్రమంలో ఇప్పటికే నాగబాబు కుటుంబం రాయ్‌పూర్‌కి వెళ్లినట్లు సమాచారం. (Bigg Boss 4: జున్నును చూసి ఏడ్చేసిన లాస్య.. వీడు నీకంటే స్ట్రాంగ్‌ అన్న మంజునాథ్‌)