నేను వద్దన్నా నా టైటిల్‌ తీసుకున్నావు.. కరణ్‌పై ప్రముఖ దర్శకుడు మధుర్‌ బండార్కర్‌ ఫైర్‌

బాలీవుడ్‌ ప్రముఖ దర్శకనిర్మాత కరణ్‌జోహార్‌ మళ్లీ వివాదంలో చిక్కుకున్నారు. తాను వద్దన్నా, తన టైటిల్‌ని తీసుకున్నాడని కరణ్‌పై ప్రముఖ దర్శకుడు మధుర్‌ బండార్కర్‌ మండిపడ్డారు

  • Manju Sandulo
  • Publish Date - 9:19 am, Sat, 21 November 20

Madhur Bhandarkar Karan Johar: బాలీవుడ్‌ ప్రముఖ దర్శకనిర్మాత కరణ్‌జోహార్‌ మళ్లీ వివాదంలో చిక్కుకున్నారు. తాను వద్దన్నా, తన టైటిల్‌ని తీసుకున్నాడని కరణ్‌పై ప్రముఖ దర్శకుడు మధుర్‌ బండార్కర్‌ మండిపడ్డారు. తన ప్రాజెక్ట్‌ని అటకెక్కించకు అంటూ అభ్యర్థించారు. ఈ మేరకు సోషల్ మీడియాలో మధుర్‌ ఓ ట్వీట్‌ చేశారు. (నవంబర్ 26న ఏపీలో అమూల్‌ ప్రాజెక్ట్‌ ప్రారంభం: మంత్రి సీదిరి అప్పలరాజు)

డియర్‌ కరణ్‌ జోహార్‌, అపూర్వ మెహతా.. మీరు బాలీవుడ్‌వైవ్స్‌ అనే నా ప్రాజెక్ట్ టైటిల్‌ని ఒక వెబ్‌సిరీస్‌ కోసం అడిగారు. దానికి నేను ఒప్పుకోలేదు. ఎందుకంటే నా ప్రాజెక్ట్‌ చిత్రీకరణలో ఉంది కాబట్టి. అయినప్పటికీ నా టైటిల్‌ని తీసుకొని దాన్ని ‘ద ఫాబలస్‌ లైవ్స్ ఆఫ్‌ బాలీవుడ్‌ వైవ్స్’ అని మార్చుకొని పెట్టుకున్నారు. ఇది ఏ మాత్రం ఆమోగ్యయోగమైనది కాదు. నా ప్రాజెక్ట్‌ని అటకెక్కించకు ప్లీజ్‌. మీ టైటిల్‌ ఛేంజ్‌ చేయాలని నేను అభ్యర్థిస్తున్నా అని కామెంట్‌ పెట్టారు. కాగా సుశాంత్ సింగ్‌ మరణం తరువాత కరణ్‌ జోహార్ చాలా నెగిటివిటీని ఎదుర్కొంటున్నారు. దానికి తోడు ఇప్పుడు మధుర్‌ బండార్కర్ అతడిపై ఆరోపణలు చేయడంతో.. నెటిజన్లు మరోసారి కరణ్‌పై విమర్శలు గుప్పిస్తున్నారు.  (Bigg Boss 4: జున్నును చూసి ఏడ్చేసిన లాస్య.. వీడు నీకంటే స్ట్రాంగ్‌ అన్న మంజునాథ్‌)