ఈమె అందంతో కుర్రకారు షేక్, రెమ్యూనరేషన్‌తో ప్రొడ్యూసర్లు షాక్ !

సినిమా ఇండస్ట్రీలోకి వచ్చి స్టార్ హీరోయిన్‌గా ఎదిగాక..హీరోయిన్స్ భారీ రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తారు. అప్పుడు నిర్మాతలు కూడా ఎంత అడిగితే అంత ఇచ్చేస్తారు.

  • Ram Naramaneni
  • Publish Date - 7:17 pm, Fri, 20 November 20
ఈమె అందంతో కుర్రకారు షేక్, రెమ్యూనరేషన్‌తో ప్రొడ్యూసర్లు షాక్ !

సినిమా ఇండస్ట్రీలోకి వచ్చి స్టార్ హీరోయిన్‌గా ఎదిగాక..హీరోయిన్స్ భారీ రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తారు. అప్పుడు నిర్మాతలు కూడా ఎంత అడిగితే అంత ఇచ్చేస్తారు. కెరీర్ స్టార్టింగ్‌లో మాత్రం ప్రొడ్యూసర్లు ఎంత ఇస్తే అంత తీసుకోవాల్సిందే. ఒక్కసారి సరైన హిట్ పడిదంటే మాత్రం ఓపెనింగులు, ఈవెంట్ల పేరుతో రెండు చేతులా సంపాదించవచ్చు. కరోనా పరిస్థితుల కారణంగా ఇటీవల పారితోషకంలో కోత విధించుకోవాలని ఇండస్ట్రీ పెద్దలు నిర్ణయించారు. అయినప్పటికీ కొంతమంది హీరోయిన్లు మెట్టు దిగడం లేదట. కాగా ఒక్క సినిమా కూడా విడుదల కానీ యంగ్ హీరోయిన్ ఏకంగా రూ.70లక్షలు డిమాండ్ చేస్తున్నట్లు ఫిల్మ్ సర్కిల్‌లో టాక్ నడుస్తోంది. మెగా హీరో వైష్ణవ్ తేజ్ హీరోగా నటించిన ‘ఉప్పెన’ చిత్రంతో టాలీవుడ్ లో హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వబోతుంది కృతి శెట్టి. ఇందులోని పలు సాంగ్స్ సూపర్ హిట్టయ్యాయి. అయితే ఆకట్టుకునే అందంతో అమ్మాయిల కలల రాణిగా మారిపోయింది. కోవిడ్ నేపథ్యంలో ఆమె నటించిన ‘ఉప్పెన’ ఇంకా థియేటర్లలో విడుదల కాలేదు. అయినప్పటికీ ఈ అమ్మడికి ఆఫర్లు ఓ రేంజులో వస్తున్నాయి.

ఇప్పటికే నాని మూవీలో ఛాన్స్ దక్కించుకోగా.. ఇంకా చాలామంది యంగ్ హీరోలు, నిర్మాతలు ఆమెను కాల్షీట్లు ఇవ్వమని అడుగుతున్నారట. దీన్ని అవకాశంగా తీసుకున్న కృతి…తన డిమాండ్ కు తగ్గట్లుగా రూ.70లక్షలిస్తేనే నటిస్తానని చెప్పడంతో ప్రొడ్యూసర్లు బెంబేలెత్తిపోతున్నారట. అయితే తెలుగులో ప్రస్తుతం యంగ్ హీరోయిన్ల కొరత ఉండటంతో ఆమె ఎంత అడిగినా ఇచ్చేందుకు కొందరు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.

Also Read :

వారెవ్వా.. అతడికి అదృష్టం ఆకాశం నుంచి ఊడిపడింది..ఒక్క రోజులో కోటీశ్వరుడు

పెంపుడు శునకంపై మితిమీరిన ప్రేమ..యువతి ఆత్మహత్య..అక్కడే పూడ్చిపెట్టాలంటూ..