05 April 2025
రెండు సినిమాలు చేస్తే ఒకటి హిట్టు.. ఇంకోటి ప్లాప్.. గ్లామర్ బ్యూటీ
Rajitha Chanti
Pic credit - Instagram
కన్నడ చిత్రపరిశ్రమలో ఆమె తోపు హీరోయిన్. కానీ తెలుగులో రెండు సినిమాలు చేస్తే ఒకటి సూపర్ హిట్టు..మరొకటి డిజాస్టర్. ఇంతకీ ఈ బ్యూటీ ఎవరంటే.
ఆ వయ్యారి మరెవరో కాదండి.. కన్నడ బ్యూటీ ఆషికా రంగనాథ్. 1996లో కర్ణాటకలో జన్మించిన ఆషికా.. కాలేజీ రోజుల్లోనే మిస్ ఫ్రెష్ ఫేస్ పోటీల్లో పాల్గొంది.
ఆ తర్వాత క్రేజీ బాయ్ సినిమాతో కన్నడ సినీరంగంలోకి అడుగుపెట్టింది. మొదటి సినిమాకే ఉత్తమ నటిగా సైమా అవార్డ్ అందుకుని అందరి దృష్టి ఆకర్షించింది.
ఫస్ట్ మూవీ సూపర్ హిట్ కావడంతో కన్నడలో ఆమెకు వరుస ఆఫర్స్ క్యూ కట్టాయి. రెండేళ్లలోనే ఆమె ఏకంగా 8 సినిమాలకు సైన్ చేసి అందరిని ఆశ్చర్యపరిచింది
కళ్యాణ్ రామ్ నటించిన అమిగోస్ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. బాక్సాఫీస్ వద్ద ఈ మూవీ డిజాస్టర్ కావడంతో ఆషికాకు అంతగా క్రేజ్ రాలేదు.
ఆ తర్వాత నాగార్జున సరసన నా సామిరంగ సినిమాలో కనిపించింది. ఈ మూవీతో సూపర్ హిట్ అందుకుంది. అలాగే నటిగా విమర్శకుల ప్రశంసలు అందుకుంది.
కానీ ఈ బ్యూటీకి తెలుగులో అంతగా ఆఫర్స్ రాలేదు. నా సామిరంగ సినిమా తర్వాత కోలీవుడ్ హీరో సిద్ధార్థ్ తో కలిసి మిస్ యూ చిత్రంలో నటించింది ఈ బ్యూటీ.
ఆ సినిమా సైతం ప్లాప్ కావడంతో ఆషికాకు ఆఫర్స్ తగ్గిపోయాయి. ప్రస్తుతం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ వరుసగా ఫోటోషూట్స్ షేర్ చేస్తుంది ఆషికా.
మరిన్ని వెబ్ స్టోరీస్
తల్లి కావాలని ఇప్పటికీ కలలు కంటాను.. ఆలస్యం అనుకోవట్లేదు.. సమంత.
డాక్టర్ కమ్ హీరోయిన్.. నెట్టింట గ్లామర్ ఫోజులు చూస్తే ఫ్యూజుల్ అవుట్
షాప్స్ క్లీన్ చేసిన అమ్మాయి.. ఇప్పుడు స్టార్ హీరోలకు లక్కీ హీరోయిన్