Alekhya Chitti: అలేఖ్య చిట్టి పచ్చళ్ల ఇష్యూలో.. సజ్జనార్‌కు ట్యాగ్ చేస్తున్న నెటిజెన్స్..
సజ్జనార్! ఈయన ఐపీఎస్ మాత్రమే కాదు.. మంచి ఫ్యాన్ బేస్ సంపాదించుకున్న ఆఫీసర్. 2008లో యాసిడ్ దాడి కేసులో నిందితుల ఎన్ కౌంటర్, 2019లో దిశ నిందితుల ఎన్ కౌంటర్‌తో పాపులర్ అయ్యారు. ఇప్పుడు తెలంగాణ ఆర్టీసీ వైస్ ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్‌గా పని చేస్తున్న ఈయన.. సోషల్ మీడియా వేదిగా మాత్రం చాలా యాక్టివ్‌గా ఉంటున్నారు.
ప్రజల్లో అవేర్‌నెస్ కల్సించేందుకు తన సోషల్ మీడియా హ్యాండిల్‌ను ఉపయోగించుకుంటున్నారు. రీసెంట్‌గా బెట్టింగ్ యాప్‌ను ప్రమోట్ చేస్తున్న వారిది ముమ్మూటికి తప్పంటూ తన గళం వినిపించారు. బెట్టింగ్ యాప్‌లను నమ్మొద్దంటూ యూత్‌లో అవేర్ నెస్ తీసుకొచ్చేలా పోస్టులు కూడా పెడుతున్నారు. ఎప్పుడూ నెటిజన్లకు అందుబాటులో ఉంటున్నారు. ఈ క్రమంలోనే కొంత మంది నెటిజన్లు.. అలేఖ్య ఇష్యూను ఈయన వరకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. పచ్చళ్ల రేటు ఇంతేంటి అని అడిగిన ఓ వ్యక్తిని.. దారుణంగా బుతూలు తిడుతూ ఓ ఆడియో మెసేజ్ పంపించింది అలేఖ్య చిట్టి. ఆ ఆడియోనే రెండు మూడు రోజుల నుంచి నెట్టింట వైరల్ అవుతోంది. ఆ వీడియోనే ఆమెపై తీవ్ర విమర్శలు వచ్చేలా.. ఆమె పికిల్స్ బిజినెస్‌కు దెబ్బపడేలా చేసింది. అయితే తాజాగా ఈ ఇష్యూపై కొందరు నెటిజన్లు.. సజ్జనార్ కలుగుజోసుకోవాలంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. పెద్దమనిషిగా ఆమెకు బుద్దిచెప్పాలంటూ ఆయనతో పాటు తెలంగాణ పోలీసులకు రిక్వెస్ట్ చేస్తున్నారు. అంతేకాదు సజ్జనార్‌ను ట్యాగ్ చేసి.. అలేఖ్య చిట్టి తిట్ల ఆడియోను.. షేర్ చేస్తున్నారు. అయితే సజ్జనార్ ఫ్యాన్స్ మాత్రం నెటిజన్లు ఆయన్ను ట్యాగ్ చేయడాన్ని తప్పుబడుతున్నారు. అలేఖ్య పచ్చళ్ల వ్యవహారంలో.. ఆయన్ను ట్యాగ్ చేస్తూ పోస్టులు పెట్టడాన్ని ఆకతాయి వ్యవహారంగా కొట్టేస్తున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
పిట్ట కూడా వాలని చెట్టు.. ఎందుకంత డేంజర్ ??
Gond Katira: సమ్మర్‌లో గోండ్ కటిరా తింటున్నారా.. ఇది మీ కోసమే!
సిల్వర్ స్క్రీన్ మీద నయా గ్లామర్.. టాలీవుడ్‌ను రూల్ చేయడం పక్క
ఇంటిముందు ఏర్పడిన భారీ గుంత.. ఏంటా అని పరిశీలించగా.. బయటపడిన ఆలయం