Andhra: వేగంగా వెళ్తున్న ట్రావెల్స్ బస్సును ఆపిన పోలీసులు.. లోపల చెక్ చేయగా
విశాఖ జిల్లా కూర్మన్నపాలెం జంక్షన్‌లో గంజాయి కలకలం రేపింది. ఓ ప్రైవేటు ట్రావెల్స్ బస్సులో భారీగా గంజాయి తరలించేందుకు సిద్ధమైన ముఠా గుట్టురట్టు చేశారు పోలీసులు. గంజాయిని బస్తాల్లో నింపి తరలించేందుకు ప్రయత్నించగా.. ముందస్తు సమాచారంతో తనిఖీలు చేశారు. ఆ వివరాలు
విశాఖ జిల్లా కూర్మన్నపాలెం జంక్షన్‌లో గంజాయి కలకలం రేపింది. ఓ ప్రైవేటు ట్రావెల్స్ బస్సులో భారీగా గంజాయి తరలించేందుకు సిద్ధమైన ముఠా గుట్టురట్టు చేశారు పోలీసులు. గంజాయిని బస్తాల్లో నింపి తరలించేందుకు ప్రయత్నించగా.. ముందస్తు సమాచారంతో తనిఖీలు చేశారు. దాంతో.. 44 బ్యాగుల్లో 100 కిలోల గంజాయి పట్టుబడింది. దీనికి సంబంధించి ఓ నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకోగా.. మరో నలుగురు గంజాయి స్మగ్లర్లు పారిపోవడంతో వారి కోసం గాలిస్తున్నారు. విశాఖ ఏజెన్సీ నుంచి హైదరాబాద్ మీదుగా ఢిల్లీకి గంజాయి తరలిస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. ఈ గంజాయి తరలింపు ముఠా వెనుక ఇంకా ఎవరెవరు ఉన్నారనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ చూడండి
ప్రధాని వెళ్లగానే పూల కుండీలపై పడ్డ జనం
మంటలతో పెట్రోలు బంకులోకి దూసుకెళ్లిన వ్యాను
క్రిస్మస్ వేళ అద్భుతం.. మత్స్యకారులకు దొరికిన సిలువ పీత
విద్యుత్ స్తంభం ఎక్కిన MLA.. కారణం ఏంటో తెలిస్తే షాక్ అవుతారు
వరుస సెలవులు, న్యూఇయర్ జోష్ పుణ్యక్షేత్రాలు కిటకిట
బాబా వంగా భవిష్యవాణి !! అణు ముప్పు తప్పదా ??
ఆటోడ్రైవర్ కాదు.. మా అతిథి.. టూర్కు తీసుకుపోయిన విదేశీ టూరిస్టు

