ఫేస్ బుక్‌లో..లైవ్ స్ట్రీమ్ గా ముంబై యువకుని ఆత్మహత్యా యత్నం, ఐర్లండ్ నుంచి ధూలే వరకు.. సేవ్ అయ్యాడు

ముంబైలో 23 ఏళ్ళ యువకుడు రేజర్  బ్లేడుతో గొంతు కోసుకుని ఆత్మహత్యా యత్నం చేశాడు. ఈ నెల 3 న రాత్రి దీన్ని ఫేస్ బుక్ లో లైవ్ స్ట్రీమ్ గా పెట్టడానికి యత్నించాడు..

ఫేస్ బుక్‌లో..లైవ్ స్ట్రీమ్ గా ముంబై యువకుని  ఆత్మహత్యా యత్నం, ఐర్లండ్ నుంచి ధూలే వరకు.. సేవ్ అయ్యాడు
Follow us
Umakanth Rao

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Jan 05, 2021 | 1:20 PM

Facebook Livestream: ముంబైలో 23 ఏళ్ళ యువకుడు రేజర్  బ్లేడుతో గొంతు కోసుకుని ఆత్మహత్యా యత్నం చేశాడు. ఈ నెల 3 న రాత్రి దీన్ని ఫేస్ బుక్ లో లైవ్ స్ట్రీమ్ గా పెట్టడానికి యత్నించాడు. రక్తమోడుతూ, బాధతో విలవిలలాడుతున్న ఈ యువకుని స్థితి చూసి ఐర్లండ్ లోని ఫేస్ బుక్ ప్రధాన కార్యాలయం వెంటనే స్పందించింది. ముంబైలోని  ధూలేలో  ఉంటున్న ఇతని  సమాచారాన్ని చిరునామాతో సహా పోలీసులకు చేరవేసింది.  దీంతో కేవలం 10 నిమిషాల్లో పోలీసులు అక్కడికి చేరుకొని ఈ యువకుడిని రక్షించి  ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఇతనికి ప్రాణాపాయం లేదని డాక్టర్లు తెలిపారు. కాగా ఐర్లండ్ లోని ఫేస్ బుక్ కార్యాలయం ఈ ఘటనపై స్పందించడం, ధూలే పోలీసులు వెంటనే అక్కడికి చేరుకొని ఇతడిని రక్షించడం స్థానికంగా సంచలనమైంది. ఎక్కడి ఐర్లండ్ ? ఎక్కడి ముంబై ? ఫేస్ బుక్ వంటి సాధనాలకు దూరాలతో నిమిత్తం లేదనడానికి ఇంతకన్నా నిదర్శనం ఏముంటుందని అంటున్నారు.

అయితే ఆత్మహత్యా యత్నానికి పాల్పడినందుకు ఈ యువకునిపై పోలీసులు కేసు పెట్టవచ్ఛునని తెలుస్తోంది.

Also Read:

CM Yogi Adityanath: ఘజియాబాద్‌ బాధితులకు సాయాన్ని ప్రకటించిన సీఎం యోగీ… మృతుల కుటుంబాలకు తలా పదిలక్షలు…

ఆస్ట్రాజెనికా వ్యాక్సిన్ కోసం ఇండియాతో బ్రెజిల్ దౌత్య సంప్రదింపులు, భారత్ బయోటెక్ టీకామందు కూడా కావాలట

జనవరి 7న జేఈఈ అడ్వాన్స్‌డ్‌ తేదీలు ప్రకటిస్తాం: కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేశ్ ఫోఖ్రియాల్