‘ఈ 5 రోజులు ప్రభుత్వం ఏ గడ్డి పీకింది.. నాపై కేసు పెడతారా…ఖబడ్దార్… ముఖ్యమంత్రి’ : చంద్రబాబు హెచ్చరిక

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు జగన్ సర్కారుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. "రామతీర్ధం నేను ఎందుకు వెళ్లకూడదు, ఎందుకు..

'ఈ 5 రోజులు ప్రభుత్వం ఏ గడ్డి పీకింది.. నాపై కేసు పెడతారా...ఖబడ్దార్... ముఖ్యమంత్రి' : చంద్రబాబు హెచ్చరిక
Follow us
Venkata Narayana

|

Updated on: Jan 05, 2021 | 12:57 PM

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు రామతీర్థం ఘటనల నేపథ్యంలో జగన్ సర్కారుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రామతీర్థ పర్యటన సందర్భంగా  తనపై కేసు పెట్టడాన్ని ఆయన ఏమాత్రం జీర్ణించుకోలేకపోయారు. వైసీపీ సర్కారుపై విమర్శల పరంపర కొనసాగిస్తూనే ప్రశ్నల వర్షం కురిపించారు.  “రామతీర్ధం నేను ఎందుకు వెళ్లకూడదు, ఎందుకు అడ్డుకున్నారు. ఈ 5 రోజులు ప్రభుత్వం ఏ గడ్డి పీకింది. శ్రీరాముడు తల తీసినప్పుడే ప్రభుత్వం సిగ్గుతో తల వంచుకోవాలి.” అని చంద్రబాబు అన్నారు.  “నాపై కేసు పెడతారా… ఖబడ్దార్ ముఖ్యమంత్రి.” అంటూ చంద్రబాబు నిప్పులు చెరిగారు. “జగన్ ఒక క్రిస్టియన్… అతని నమ్మకం అతనిది….మా నమ్మకం మాది. సాయిరెడ్డి ని తీసుకు వెళ్లి పూజలు చేస్తారా.” అని ప్రశ్నించిన ఆయన, మెజారిటీ ప్రజలు ఉండే హిందువుల మనోభావాలు కొనసాగించాలని డిమాండ్ చేశారు.

“సీఎం, హోంమంత్రి, డీజీపీ తో పాటు స్థానిక ఎస్పీ కూడా క్రిస్టియన్. ముఖ్యమంత్రి మత మార్పిడులు చెయ్యడం ఏంటి? పోలీస్ స్టేషన్ లో క్రిస్మస్ చేస్తారా.. శ్రీవారి టెంపుల్లో క్రిస్మస్న్ శుభాకాంక్షలు చెపుతారా. క్రిస్టియన్ లకే మనోభావాలు ఉంటాయా….హిందువులకు, ముస్లింలకు ఉండవా” అంటూ చంద్రబాబు సీరియస్ అయ్యారు.   ఫాస్టర్లకు 5 వేలు ఇవ్వడం చట్ట విరుద్ధమన్న చంద్రబాబు,  రిజర్వేషన్ లు ఉన్న ఫాస్టర్ లకు 5 వేలు ఇవ్వడం ఎందుకు? అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. జగన్ కు వాటికన్ సిటీ అంటే ఆనందం…అమరావతి అంటే కంపరం అంటూ చంద్రబాబు వ్యాఖ్యానించారు.