ఆస్ట్రాజెనికా వ్యాక్సిన్ కోసం ఇండియాతో బ్రెజిల్ దౌత్య సంప్రదింపులు, భారత్ బయోటెక్ టీకామందు కూడా కావాలట

ఆస్ట్రాజెనికా వ్యాక్సిన్ కోసం బ్రెజిల్ ఇండియాతో దౌత్య సంప్రదింపుల ప్రక్రియను ప్రారంభించనుంది. ఒకప్పుడు వర్ధమాన దేశాల్లో సామూహిక వ్యాక్సినేషన్ విషయంలో..

ఆస్ట్రాజెనికా వ్యాక్సిన్ కోసం ఇండియాతో బ్రెజిల్ దౌత్య సంప్రదింపులు, భారత్ బయోటెక్ టీకామందు కూడా కావాలట
Follow us
Umakanth Rao

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Jan 05, 2021 | 12:33 PM

Covid Vaccine:ఆస్ట్రాజెనికా వ్యాక్సిన్ కోసం బ్రెజిల్ ఇండియాతో దౌత్య సంప్రదింపుల ప్రక్రియను ప్రారంభించనుంది. ఒకప్పుడు వర్ధమాన దేశాల్లో సామూహిక వ్యాక్సినేషన్ విషయంలో ఇతర ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలిచిన బ్రెజిల్ ఇప్పుడు కరోనా వైరస్ ధాటికి బేర్ మంటోంది. తమకు ఆపన్నహస్తం అందించే దేశాల కోసం అర్రులు చాస్తోంది. ఈ దేశంలోని ఫయోక్రిజ్ ఇన్స్టిట్యూట్ భారత్ నుంచి 10 లక్షల డోసుల ఆస్ట్రాజెనికా   వ్యాక్సిన్ ని దిగుమతి చేసుకోవాలను కుంటోంది. ఫిబ్రవరి రెండో వారానికి ఈ టీకామందు బ్రెజిల్ కి చేరవచ్ఛు. అమెరికా తరువాత ఈ దేశంలో దాదాపు 2 లక్షల కరోనా రోగులు మృతి చెందారు.  చిలీ, అర్జెంటీనా దేశాల నుంచి కూడా వ్యాక్సిన్ల సాయాన్ని ఈ దేశం కోరుతోంది.

ఇండియా నుంచి టీకామందును దిగుమతి చేసుకోవడంలో ఎలాంటి అవరోధాలు ఉన్నా దౌత్యపరంగా పరిష్కరించుకుంటామని బ్రెజిల్  ప్రభుత్వం ప్రకటించింది. ఇక  హైదరాబాద్ లోని భారత్ బయోటెక్ ఉత్పత్తి చేసిన కొవాగ్జిన్ వ్యాక్సిన్ ని దిగుమతి చేసుకుంటామని ఈ దేశంలోని ప్రైవేట్ క్లినిక్ లు వెల్లడించాయి. 50 లక్షల కొవాగ్జిన్ టీకామందు అవసరమని ఈ క్లినిక్ లు పేర్కొన్నాయి. ఇండియాలోని హెల్త్ రెగ్యులేటరీ ఈ వ్యాక్సిన్ అత్యవసర వినియోగానికి అనుమతినిచ్చింది. కానీ తమ టీకామందుకు అనుమతించాలని భారత్ బయోటెక్.. బ్రెజిల్ లోని హెల్త్ రెగ్యులేటరీ అన్ విసాకు ఇంకా దరఖాస్తు చేసుకోలేదు. దేశంలో ఇది మూడో దశ ట్రయల్స్ కి వెళ్లాల్సి ఉంటుందని ఈ ఏజన్సీ చెబుతోంది.

బ్రెజిలియన్ అసోసియేషన్ ఆఫ్ వ్యాక్సిన్ క్లినిక్స్ అధ్యక్షుడైన గెరాల్డ్ బార్బోసా ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ.. తాము ఓ ప్రతినిధిబృందంతో ఇండియాకు వెళ్తున్నామని, భారత్ బయో టెక్  సంస్థతో ఇదివరకే అవగాహనా పత్రాన్ని కుదుర్చుకున్నామని తెలిపారు. మార్చి రెండోవారానికల్లా కొవాగ్జిన్ తమకు అందుబాటులోకి వస్తుందని ఆశిస్తున్నట్టు ఆయన చెప్పారు.

Also Read:

Jc Diwakar Reddy: జేసీ దివాకర్‌రెడ్డికి ఊహించని షాక్.. కేసు నమోదు చేసిన పెద్దపప్పూర్ పోలీసులు

జనవరి 7న జేఈఈ అడ్వాన్స్‌డ్‌ తేదీలు ప్రకటిస్తాం: కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేశ్ ఫోఖ్రియాల్

Kajol Tribhanga Trailer: ఆకట్టుకుంటోన్న కాజోల్‌ ‘త్రిభంగా’ ట్రైలర్‌.. మూడు తరాల మహిళల మధ్య జరిగే..