CM Yogi Adityanath: ఘజియాబాద్ బాధితులకు సాయాన్ని ప్రకటించిన సీఎం యోగీ… మృతుల కుటుంబాలకు తలా పదిలక్షలు…
ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ఘజియాబాద్‌లో మురాద్ నగర్‌లో జనవరి 3న ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. శ్మశానవాటికలోని కాంప్లెక్స్ గ్యాలరీ పైకప్పు ఒక్కసారిగా కుప్పకూలింది...
CM Yogi Adityanath: ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ఘజియాబాద్‌లో మురాద్ నగర్‌లో జనవరి 3న ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. శ్మశానవాటికలోని కాంప్లెక్స్ గ్యాలరీ పైకప్పు ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ ఘటనలో 21 మంది మృత్యువాత పడ్డారు. దాదాపు 20 మందికి పైగా గాయపడ్డారు. అయితే మృతుల కుటుంబాలకు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యానాథ్ ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. చనిపోయిన వారి కుటుంబాలకు తలా పది లక్షల రూపాయలు అందించనున్నట్లు ప్రకటించారు. అంతేకాకుండా ఘటనకు కారకులైన వారిపై నేషనల్ సెక్యూరిటీ యాక్ట్ కింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు.
కాగా… ఓ వ్యక్తి అంత్యక్రియలో పాల్గొనేందుకు బంధవులంతా శ్మశాన వాటికకు వచ్చారు. అదే సమయంలో భారీ వర్షం కురుస్తుండటంతో వారంతా ఆ శ్మశాన వాటికలో ఉన్న కాంప్లెక్స్ గ్యాలరీలో తలదాచుకున్నారు. అయితే అది కొత్తగా నిర్మించినది కావడం, భారీ వర్షం కారణంగా పూర్తిగా నానడంతో గ్యాలరీ పైకప్పు ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. దాంతో దానికింత తలదాచుకున్న వారంతా అందులో చిక్కుపోయారు. ఈ ఘటన సంచలనం సృష్టించింది.
Also read: