AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Jc Diwakar Reddy: జేసీ దివాకర్‌రెడ్డికి ఊహించని షాక్.. కేసు నమోదు చేసిన పెద్దపప్పూర్ పోలీసులు

టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డికి పోలీసులు షాకిచ్చారు. పోలీసుల విధులకు ఆటంకం కలిగించారన్న ఫిర్యాదుతో పెద్దపప్పూర్ స్టేషన్‌లో జేసీపై..

Jc Diwakar Reddy: జేసీ దివాకర్‌రెడ్డికి ఊహించని షాక్.. కేసు నమోదు చేసిన పెద్దపప్పూర్ పోలీసులు
Ram Naramaneni
|

Updated on: Jan 05, 2021 | 12:20 PM

Share

Jc Diwakar Reddy : టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డికి పోలీసులు షాకిచ్చారు. పోలీసుల విధులకు ఆటంకం కలిగించారన్న ఫిర్యాదుతో పెద్దపప్పూర్ స్టేషన్‌లో జేసీపై 353, 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. సోమవారం తాడిపత్రిలో జేసీ బ్రదర్స్ దీక్ష పిలుపుతో ఉద్రిక్తత తలెత్తిన విషయం తెలిసిందే. తమపై ఉన్న ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులకు వ్యతిరేకంగా తహశీల్దార్ ఆఫీసు ఎదుట జేసీ సోదరులు ఆమరణ దీక్ష చేయబోతున్నట్లు ప్రకటించారు. అయితే పోలీసులు అందుకు అనుమతి నిరాకరించారు.

గొడవలు అయ్యే అవకాశం ఉండటంతో.. జేసీ దివాకర్‌రెడ్డిని జూటూరులోని ఆయన తోటలో, ప్రభాకర్‌రెడ్డిని తాడిపత్రిలోని ఆయన ఇంట్లో హౌస్ అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో తాము శాంతియుతంగా దీక్ష చేస్తుంటే..ఎందుకు అనుమతించరంటూ జేసీ దివాకర్ రెడ్డి పోలీసులతో వాగ్వాదానికి దిగారు. కాస్త దురుసుగా వ్యవహరించారు. జేసీ కామెంట్స్‌పై డీఎస్పీ ఏ శ్రీనివాస్ సీరియస్ అయ్యారు. నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని హెచ్చరించారు. ఏ మాట పడితే..ఆ మాట అంటే పడేది లేదన్నారు. తన ఇంట్లోకి ఏ హక్కుతో పోలీసులు ప్రవేశిస్తారంటూ జేసీ ప్రశ్నించారు. దీంతో విధులకు ఆటంకం కలిగించారని జేసీ దివాకర్ రెడ్డిపై కేసు నమోదైంది.

Also Read :

జంగారెడ్డిగూడెంలో హృదయ విదారక ఘటన.. తల్లి మృతదేహంతోనే ఐదు రోజులు జీవనం

భర్త స్నేహితుడితో సాన్నిహిత్యం..కట్టుకున్నవాడిని చంపించిన వైనం..గుత్తిలో దారుణం