ఫేస్ బుక్ కి కోపం వచ్చింది

ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ తమపై చేసిన ఆరోపణల్ని సామాజిక మాధ్యమ దిగ్గజం ఫేస్ బుక్ తీవ్రంగా ఖండించింది. భారత్ లో ఫేస్ బుక్ రాజకీయ పక్షపాతం చూపుతోందని..

ఫేస్ బుక్ కి కోపం వచ్చింది
Follow us

|

Updated on: Sep 03, 2020 | 8:13 PM

ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ తమపై చేసిన ఆరోపణల్ని సామాజిక మాధ్యమ దిగ్గజం ఫేస్ బుక్ తీవ్రంగా ఖండించింది. భారత్ లో ఫేస్ బుక్ రాజకీయ పక్షపాతం చూపుతోందని.. ఓ వర్గానికి అనుకూలంగా వ్యవహరిస్తోందన్న కాంగ్రెస్ పార్టీ ఆరోపణల్ని కొట్టిపారేసింది. తాము ఎవరికీ వత్తాసు పలకడంలేదని, విద్వేషాలను, మత దురభిమానాలను ఎల్లప్పుడూ ఖండిస్తామని స్పష్టం చేసింది. ఫేస్ బుక్ అంటే ప్రజలు స్వేచ్ఛగా తమ అభిప్రాయాలు వ్యక్తీకరించుకునే వేదిక అని చెప్పుకొచ్చింది. కాంగ్రెస్ వ్యాఖ్యలపై ఫేస్ బుక్ ప్రజావిధానం.. భద్రత విభాగం డైరెక్టర్ నీల్ పాట్స్ స్పందించారు. భారత్ లో తాము పక్షపాతంతో వ్యవహరిస్తున్నామన్న వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణించామని, తాము పక్షపాత ధోరణి పాటించడంలేదని, అత్యున్నత స్థాయిలో సమగ్రతను కాపాడతామని కాంగ్రెస్ నేత కేసీ వేణుగోపాల్ కు హామీ ఇచ్చింది. కాగా, భారత ప్రజాస్వామ్య ప్రక్రియలో ఫేస్ బుక్ జోక్యం చేసుకుంటోందని, అధికార బీజేపీ సభ్యుల విద్వేష పూరిత ప్రసంగాలపై నిబంధనలు వర్తింపచేయడంలో చూసీ చూడనట్టు వ్యవహరిస్తోందని విమర్శిస్తూ.. అందుకు నిదర్శనంగా అంతర్జాతీయ మీడియాలో వస్తున్న కథనాలను చూపించి కాంగ్రెస్ నేత కేసీ వేణుగోపాల్ ఫేస్ బుక్ కు లెటర్ రాసిన నేపథ్యంలో ఎఫ్ బి ఇలా స్పందించింది.