మలింగ ఆడకపోవచ్చు..!

ముందు నుంచి అంతా అనుకున్నట్లే జరుగుతోంది. అంతా ఐపీఎల్‌లో ముంబయి ఇండియన్స్‌ పేసర్‌ లసిత్‌ మలింగ రాకపై అనుమానాలు వ్యక్తం చేశారు.

మలింగ ఆడకపోవచ్చు..!
Follow us

|

Updated on: Sep 03, 2020 | 8:05 PM

Lasith Malinga  : ముందు నుంచి అంతా అనుకున్నట్లే జరుగుతోంది. అంతా ఐపీఎల్‌లో ముంబయి ఇండియన్స్‌ పేసర్‌ లసిత్‌ మలింగ రాకపై అనుమానాలు వ్యక్తం చేశారు. అలాంటి అనుమానాన్నే టీమ్‌ఇండియా మాజీ క్రికెటర్‌ ఆకాశ్‌ చోప్రా కూడా సందేహం వ్యక్తంచేశారు. వ్యక్తిగత కారణాల రీత్యా శ్రీలంక పేసర్‌ ఈ ఏడాది యూఏఈలో నిర్వహించే మెగా టోర్నీలో పాల్గొనడంలేదన్న సంగతి తెలిసిందే.

మలింగ ఈ సీజన్‌కు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాడు అని వెల్లడించారు. అతని తండ్రి ఆరోగ్యం బాగోలేక పోవడంతో కొద్ది రోజుల్లోనే శస్త్రచికిత్స నిర్వహించాల్సి ఉందన్నారు. అందుకే అతడు ఇంటి దగ్గరే ఉండాలనుకున్నట్లు చెప్పారు మాజీ టెస్టు ఓపెనర్‌ ఆకాశ్ చోప్రా.

అలాగే ఈ దిగ్గజ పేసర్‌ లేకపోతే ఐపీఎల్‌లో సందడి తగ్గుతుందని అని కూడా అన్నారు. నిజం చెప్పాలంటే మలింగ లేకపోతే ఈ సీజన్‌ కాస్త వెలితిగా కనిపిస్తుందని అభిప్రాయ పడ్డారు. 12 ఏళ్ల చరిత్ర మొత్తం చూస్తే అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా మలింగ అని అన్నారు. అలాంటి పేసర్‌ లేకపోతే ఈ సీజన్‌లో మజా ఉండదన్నారు. ఈ శ్రీలంక పేసర్‌ను మళ్లీ మనం ఐపీఎల్‌లో చూడకపోవచ్చుని కూడా అన్నారు. రాబోయే రోజుల్లో అతడు బౌలింగ్‌ కోచ్‌గా మారాతున్నాడు అని అన్నారు. గతేడాది చెన్నై సూపర్‌ కింగ్స్‌తో ఆడిన ఫైనల్‌ల్లో చివరి ఓవర్‌ వేసి.. ఆఖరి బంతికి ముంబయిని గెలిపించాడు అని ఆకాశ్‌చోప్రా గుర్తుచేసుకున్నాడు.