ఇక మీ పని ఖతం.. మీరు మాజీలే: మోదీపై దీదీ సెటైర్
ఎన్నికల తరుణంలో మాజీ ప్రధానితో వేదిక పంచుకోవడం ఇష్టం లేకనే తాను మోదీ ఫోన్‌కాల్‌కు స్పందించలేదని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఘాటుగా వ్యాఖ్యానించారు. ఫొని తుఫానుపై తాను రాజకీయాలు చేస్తున్నానంటూ మోదీ చేసిన ఆరోపణలను ఖండించిన ఆమె.. త్వరలో పదవిని కోల్పోనున్న మోదీతో తాను మాట్లాడవలసింది ఏముంటుందని అన్నారు. తుఫాను రోజున తాను ఖరగ్‌పూర్‌లో ఉన్నందు వల్లే ఆయన ఫోన్ కాల్‌ను రిసీవ్ చేసుకోలేకపోయానని ఆమె అన్నారు. తిరిగి మోదీ అధికారంలోకి వచ్చేది కల్ల అని […]
ఎన్నికల తరుణంలో మాజీ ప్రధానితో వేదిక పంచుకోవడం ఇష్టం లేకనే తాను మోదీ ఫోన్‌కాల్‌కు స్పందించలేదని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఘాటుగా వ్యాఖ్యానించారు. ఫొని తుఫానుపై తాను రాజకీయాలు చేస్తున్నానంటూ మోదీ చేసిన ఆరోపణలను ఖండించిన ఆమె.. త్వరలో పదవిని కోల్పోనున్న మోదీతో తాను మాట్లాడవలసింది ఏముంటుందని అన్నారు. తుఫాను రోజున తాను ఖరగ్‌పూర్‌లో ఉన్నందు వల్లే ఆయన ఫోన్ కాల్‌ను రిసీవ్ చేసుకోలేకపోయానని ఆమె అన్నారు. తిరిగి మోదీ అధికారంలోకి వచ్చేది కల్ల అని మమతా కుండ బద్ధలు కొట్టారు.
కాగా తుఫాను పరిస్థితులపై చర్చించేందుకు తాను దీదీతో మాట్లాడేందుకు రెండు సార్లు ప్రయత్నించానని.. కానీ ఆమె స్పందించలేదని, ఇది ఆమె అహంకారానికి నిదర్శనమని మోదీ అంతకుముందు ఫైర్ అయిన సంగతి తెలిసిందే.