Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kiwi Benefits: రోజుకి ఒక కప్పు కివీ పండ్లు తింటే ఎన్ని లాభాలో తెలుసా..?

మానసిక సమస్యలతో బాధపడేవారు ఒత్తిడిని తగ్గించుకోవడానికి దీన్ని తినాలి. కివి మన రోగనిరోధక శక్తిని చాలా పెంచుతుంది. ఇది అనేక వ్యాధులు మరియు ఇన్ఫెక్షన్ల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

Kiwi Benefits: రోజుకి ఒక కప్పు కివీ పండ్లు తింటే ఎన్ని లాభాలో తెలుసా..?
Kiwi Benefits
Follow us
Jyothi Gadda

|

Updated on: Jan 05, 2023 | 1:22 PM

ఏడాది పొడవునా లభించే పండు కివీ.. సూపర్‌ఫుడ్ కేటగిరీలో ఫస్ట్‌ ప్లేస్‌లో ఉంటుంది కివీఫ్రూట్‌. ఆరోగ్యానికి అవసరమైన అనేక ముఖ్యమైన పోషకాలు కివీలో ఉన్నాయి. ఈ పండు పలు అనారోగ్య సమస్యలకు సూపర్ మెడిసిన్‌గా పనిచేస్తుంది. మధుమేహం, గుండె జబ్బులు, నిద్రలేమితో బాధపడేవారికి కివీ పండు దివ్యౌషదంగా పనిచేస్తుంది. గుండె జబ్బులు ఉన్నవారు సాధారణంగా కివీని తినడం మంచిది. ఇది గుండెపోటు ప్రమాదాన్ని తగ్గిస్తుంది. అధిక రక్తపోటు ఉన్నవారు ఖచ్చితంగా కివీ పండు తింటే బీపీ కంట్రోల్ లోకి వస్తుంది. ఇది కేలరీలు తక్కువగా ఉన్నందున, ఇది డయాబెటిక్ రోగులకు ఏ ఇతర ఔషధాల కంటే తక్కువ ప్రభావవంతమైనది కాదు. ఇది చక్కెర స్థాయిని తగ్గిస్తుంది. కివి తినడం వల్ల శరీరంలోని టాక్సిన్స్ బయటకు పోతాయి. దీని సానుకూల ప్రభావం మన చర్మంపై కనిపించడం ప్రారంభిస్తుంది.

రక్తపోటు నియంత్రణలో కివీ పండ్లు బాగా పనిచేస్తాయి. రక్తంలోని చక్కెర స్థాయిలను తగ్గించే గుణం కివీకి ఉంది. ఇది మ‌ధుమేహం ఉన్న వారికి మేలు చేస్తుంది. రోజుకు రెండు, మూడు కివీ పండ్లు తింటే నేత్ర వ్యాధులు దూరమవుతాయి. వయసు పెరుగుదలతో వచ్చే కణజాల క్షీణతను కివీ పండ్లు తగ్గిస్తాయి. పడుకోడానికి గంట ముందు రెండు కివీ పళ్లు తింటే హాయిగా నిద్రపడుతుంది. కివీని రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల చర్మంపై అద్భుతమైన గ్లో వస్తుంది. చర్మంపై ముడతలు మాయమవుతాయి. కడుపు సమస్యలు ఉన్నవారు కివీని క్రమం తప్పకుండా తీసుకోవాలి. అంతే కాకుండా కడుపులోని అల్సర్‌లను నయం చేయడంలో కూడా సహాయపడుతుంది. కివిలో ఐరన్ మరియు ఫోలిక్ యాసిడ్ పుష్కలంగా ఉంటుంది.

కివీ పండు ఎముకలకు బలాన్నిస్తుంది.. ఇది గర్భిణీ స్త్రీలకు ఉపయోగకరంగా ఉంటుంది. ఇది కీళ్ల నొప్పులను కూడా తగ్గిస్తుంది. మానసిక సమస్యలతో బాధపడేవారు ఒత్తిడిని తగ్గించుకోవడానికి దీన్ని తినాలి. కివి మన రోగనిరోధక శక్తిని చాలా పెంచుతుంది. ఇది అనేక వ్యాధులు మరియు ఇన్ఫెక్షన్ల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని హెల్త్ టిప్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..