Viral Video: అసలే అందమైన డాల్ఫిన్‌.. ఆపై పింక్‌ కలర్‌లో తెగ హల్‌చల్‌ చేస్తోంది.. చూస్తే ఫిదా అవ్వాల్సిందే..

కొన్నిసార్లు అవి గోధుమ, గులాబీ రంగులను కలిగి ఉంటాయి. ఇప్పుడు ఇక్కడ హల్‌చల్‌ చేస్తున్న ఈ పింక్‌ డాల్ఫిన్స్‌ చూసిన నెటిజన్లు ఫిదా అవుతున్నారు.

Viral Video: అసలే అందమైన డాల్ఫిన్‌.. ఆపై పింక్‌ కలర్‌లో తెగ హల్‌చల్‌ చేస్తోంది..  చూస్తే ఫిదా అవ్వాల్సిందే..
Pink Dolphin
Follow us

|

Updated on: Jan 05, 2023 | 12:50 PM

సోషల్ మీడియాలో ఎన్నో రకాలైన వీడియోలు కనిపిస్తాయి. ఒక్కోసారి కొన్ని వీడియోలు ఆశ్చర్యం కలిగిస్తాయి. మరికొన్ని వీడియోలు ఆసక్తికరంగానూ ఇంకొన్ని వీడియోలు షాకింగ్‌గానూ ఉంటాయి. వాటిని చూసిన తర్వాత నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తారు. తాజాగా సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతోంది. డాల్ఫిన్‌లు లేత గోధుమరంగు రంగులో ఉంటాయని మనకు తెలిసిందే. కానీ మీరు ఎప్పుడైనా పింక్ డాల్ఫిన్‌ని చూశారా? ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోలో పింక్ కలర్ డాల్ఫిన్లు సముద్రంలో ఈత కొడుతూ కనిపించడం ప్రజలను విస్మయానికి గురి చేసింది. సముద్రంలో పింక్ కలర్ డాల్ఫిన్‌ గెంతులు చూసిన సోషల్ మీడియా యూజర్లు ఆశ్చర్యపోతున్నారు.

సముద్రాలు, నదులలో నివసించే డాల్ఫిన్లు ప్రపంచంలోని అత్యంత తెలివైన జీవులలో ఒకటిగా పరిగణించబడతాయి. మనుషుల కంటే 10 రెట్లు మెరుగ్గా వినగలగడమే వాటికున్న అతి పెద్ద లక్షణం. డాల్ఫిన్‌లు లేత గోధుమ రంగులో ఉంటాయని తెలుసు. కానీ, ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోలో పింక్ కలర్ డాల్ఫిన్లు సముద్రంలో ఈత కొడుతూ కనిపిస్తున్నాయి. ప్రజలు ఈ రంగు డాల్ఫిన్స్‌ని చూసి ముచ్చపడుతున్నారు. అసలే డాల్ఫిన్స్‌.. ఆపై పింక్‌ కలర్‌లో చూడటానికి అందంగా ఉన్నాయంటూ వాటిని చూసేందుకు ఎగబడుతున్నారు. ఇది నిజంగానే ఆశ్చర్యకరమైన విషయంగా చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి

పింక్ డాల్ఫిన్‌తో పాటు లేత గోధుమరంగు డాల్ఫిన్ సముద్రంలోకి ఎలా డైవింగ్ చేస్తున్నాయో వీడియోలో మీరు చూడవచ్చు. దీని గురించి ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, కొన్నిసార్లు డాల్ఫిన్లు పూర్తిగా గులాబీ రంగులో కనిపిస్తాయి. కొన్నిసార్లు అవి గోధుమ, గులాబీ రంగులను కలిగి ఉంటాయి. ఇప్పుడు ఇక్కడ హల్‌చల్‌ చేస్తున్న ఈ పింక్‌ డాల్ఫిన్స్‌ చూసిన నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ఈ వీడియోను @buitengebiden అనే ఐడి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ట్విట్టర్‌లో షేర్ చేసింది. వీడియో చూసిన నెటిజన్లు భిన్నమైన కామెంట్స్‌ చేస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.