Kidnap: సినిమా స్టైల్లో బాలుడి కిడ్నాప్‌.. సింగం స్టైల్లో పోలీసుల సెర్చ్‌ ఆపరేషన్‌ సక్సెస్‌..

పోలీసులు తమను వెంబడిస్తున్నారని పక్కా సమాచారం అందుకున్న కిడ్నాపర్లు సైతం అప్రమత్తమయ్యారు. అదే రోజు సాయంత్రం 4 గంటల సమయంలో ..

Kidnap: సినిమా స్టైల్లో బాలుడి కిడ్నాప్‌.. సింగం స్టైల్లో పోలీసుల సెర్చ్‌ ఆపరేషన్‌ సక్సెస్‌..
Kidnap
Follow us

|

Updated on: Jan 05, 2023 | 9:26 AM

స్కూల్‌కి వెళ్తున్న బాలుడిని సినిమా తరహాలో కిడ్నాప్ చేసి డబ్బులు డిమాండ్ చేసిన ఘటన కర్ణాటక రాష్ట్రం కలబురగి జిల్లాలో చోటుచేసుకుంది. కలబురగిలోని సిద్దేశ్వర్ కాలనీకి చెందిన సుదర్శన్ అనే పదేళ్ల బాలుడిని కిడ్నాప్ చేసిన కిడ్నాపర్లు.. ఆ తర్వాత ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడే అయిన బాలుడి తండ్రికి ఫోన్ చేసి డబ్బులు డిమాండ్ చేశారు. టీచర్ వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయగా, సినిమా కిడ్నాప్ పై స్పందించిన పోలీసులు సింగం తరహాలో ఆపరేషన్ ప్రారంభించి బాలుడిని రక్షించి తల్లిదండ్రులకు అప్పగించారు. మరింత పూర్తి వివరాల్లోకి వెళితే..

కలబురగి నగర్ సిద్దేశ్వర్ కాలనీకి చెందిన సుదర్శన్ (10) ప్రభుత్వ సీనియర్ ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు గురునాథ్ రాథోడ్ కుమారుడు. ఎప్పటిలాగే జనవరి 04 ఉదయం 9 గంటల ప్రాంతంలో సుదర్శన్ స్కూల్‌కి బయల్దేరాడు. పాఠశాలకు వెళ్తుండగా మార్గమధ్యలో కిడ్నాపర్లు ఆటోలో వచ్చి బాలుడిని ఎత్తుకెళ్లారు. కిడ్నాప్‌ జరిగిన కొంత సమయం తరువాత, ఉపాధ్యాయుడు గురునాథ్‌కు ఫోన్ చేసి, మీ కొడుకు కిడ్నాప్‌కు గురయ్యాడని చెప్పారు.

మీ కొడుకు క్షేమంగా మీ ఇంటికి చేరాలంటే పది లక్షలు ఇవ్వాలని గురునాథ్‌ను కిడ్నాపర్లు డిమాండ్ చేశారు. విషయాన్ని పోలీసులకు చెబితే మీ కుమారుడిని చంపేస్తామని బెదిరించారు. కొడుకు క్షేమం కోసం భయాందోళనకు గురైన గురునాథ్ కలబురగి యూనివర్సిటీ పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందించాడు. పోలీసులు వెంటనే అప్రమత్తమై బాలుడిని రక్షించేందుకు చర్యలు చేపట్టారు.

ఇవి కూడా చదవండి

యూనివర్శిటీ స్టేషన్ సీఐ, అతని బృందం చిన్నారిని రక్షించేందుకు కిడ్నాపర్ల కోసం వేటసాగించారు. పోలీసులు తమను వెంబడిస్తున్నారని పక్కా సమాచారం అందుకున్న కిడ్నాపర్లు సైతం అప్రమత్తమయ్యారు. అదే రోజు సాయంత్రం 4 గంటల సమయంలో కలబురగి తాలూకాలోని పాల గ్రామ శివారులోని నిర్జన ప్రాంతంలో బాలుడిని వదిలి పారిపోయారు. బాలుడిని రక్షించిన పోలీసులు అతడిని తల్లిదండ్రులకు అప్పగించారు. కిడ్నాపర్ల కోసం విస్తృత గాలింపుచేపట్టారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

భారతీయ బాలుడి నిజాయతీకి దుబాయ్ పోలీసులు ఫిదా.!
భారతీయ బాలుడి నిజాయతీకి దుబాయ్ పోలీసులు ఫిదా.!
ఇంట్లో పెట్స్‌ని పెంచుకునేవాళ్లు తప్పక చూడాల్సిన న్యూస్‌ ఇది..
ఇంట్లో పెట్స్‌ని పెంచుకునేవాళ్లు తప్పక చూడాల్సిన న్యూస్‌ ఇది..
ఛీ.. ఇదేం పాడుపని.. మహిళా కారులో ఉండగానే డ్రైవర్‌ గలీజు పని..
ఛీ.. ఇదేం పాడుపని.. మహిళా కారులో ఉండగానే డ్రైవర్‌ గలీజు పని..
ఈ ఏడాది సకాలంలోనే రుతుపవనాలు.. ముందుగానే వర్ష సూచన.
ఈ ఏడాది సకాలంలోనే రుతుపవనాలు.. ముందుగానే వర్ష సూచన.
పైకి చూస్తే ఉల్లిపాయల బస్తాలు.. లోపల చూస్తే షాకింగ్‌ సీన్‌..
పైకి చూస్తే ఉల్లిపాయల బస్తాలు.. లోపల చూస్తే షాకింగ్‌ సీన్‌..
ట్రాఫిక్‌ రూల్సా మజాకా.! కారులో హెల్మెట్ పెట్టుకోలేదని ఫైన్.
ట్రాఫిక్‌ రూల్సా మజాకా.! కారులో హెల్మెట్ పెట్టుకోలేదని ఫైన్.
లే ఆఫ్ ఎదుర్కొంటున్న హెచ్ 1బీ వీసాదారులకు గుడ్‌ న్యూస్‌.
లే ఆఫ్ ఎదుర్కొంటున్న హెచ్ 1బీ వీసాదారులకు గుడ్‌ న్యూస్‌.
పసిప్రాణం కోసం ఆరాటం.. రూ.17.5 కోట్ల ఇంజెక్షన్‌కు నిధుల సేకరణ.!
పసిప్రాణం కోసం ఆరాటం.. రూ.17.5 కోట్ల ఇంజెక్షన్‌కు నిధుల సేకరణ.!
హిట్టా.? ఫట్టా.? ఆహాలో రిలీజ్ అయ్యిన విద్యా వాసుల అహం రివ్యూ.
హిట్టా.? ఫట్టా.? ఆహాలో రిలీజ్ అయ్యిన విద్యా వాసుల అహం రివ్యూ.
ధనుష్ ఒక గే.. సుచిత్ర షాకింగ్ కామెంట్స్. వీడియో వైరల్..
ధనుష్ ఒక గే.. సుచిత్ర షాకింగ్ కామెంట్స్. వీడియో వైరల్..