ఏపీలో ఈవీఎంలపై రగడ..!
ఏపీలో ఎన్నికల పోలింగ్ ముగిసింది. పోలింగ్ సమయంలో పలు చోట్ల ఉద్రిక్తతలు జరిగిన విషయం తెలిసిందే. ఇక పోలింగ్ అయిన మరుసటి రోజు నుంచి ఈవీఎంల పారదర్శకత మీద అటు అధికార టీడీపీ, ఇటు ప్రతిపక్ష వైసీపీ పార్టీ ఇద్దరూ కూడా ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. మరోవైపు ఏపీలో ఈవీఎంల పని తీరుపై అనుమానాలు వ్యక్తం చేస్తూ ఇప్పటికే ఏపీ సీఎం చంద్రబాబు కేంద్ర ఎన్నికల కమీషన్ ను కలిసి జాతీయ స్థాయిలో పోరాటం చేస్తున్న […]
ఏపీలో ఎన్నికల పోలింగ్ ముగిసింది. పోలింగ్ సమయంలో పలు చోట్ల ఉద్రిక్తతలు జరిగిన విషయం తెలిసిందే. ఇక పోలింగ్ అయిన మరుసటి రోజు నుంచి ఈవీఎంల పారదర్శకత మీద అటు అధికార టీడీపీ, ఇటు ప్రతిపక్ష వైసీపీ పార్టీ ఇద్దరూ కూడా ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. మరోవైపు ఏపీలో ఈవీఎంల పని తీరుపై అనుమానాలు వ్యక్తం చేస్తూ ఇప్పటికే ఏపీ సీఎం చంద్రబాబు కేంద్ర ఎన్నికల కమీషన్ ను కలిసి జాతీయ స్థాయిలో పోరాటం చేస్తున్న విషయం తెలిసిందే. ఈవీఎంలోని ఓట్లను, వివి ప్యాట్ స్లిప్ లను సరిచూడటంలో ఇబ్బందేమిటని కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆయన సూటిగా నిలదీశారు. ఈవీఎంలపై ముందు నుంచి అనుమానాలు వ్యక్తం చేస్తూనే ఉన్నామని తెలిపారు. వీవీ ప్యాట్లను లెక్కించాలంటే ఆరు రోజులు పడుతుందని కోర్టుకు ఈసీ తప్పుడు అఫిడవిట్ ఇచ్చిందని పేర్కొన్నారు. తమ పోరాట ఫలితంగానే వీవీ ప్యాట్లు పెట్టారని అన్నారు. టెక్నాలజీలో అగ్రగాములైన జర్మనీ, నెదర్లాండ్స్, ఐర్లాండ్ వంటి దేశాలే ఈవీఎంల నుంచి బ్యాలెట్ లకు వచ్చాయని.. టెక్నాలజీలో వెనకబడిన 18 దేశాలు మాత్రమే ఈవీఎంలను ఉపయోగిస్తున్నాయని గుర్తు చేశారు. ఢిల్లీలో 30 లక్షల ఓట్లు తీసేశారని.. ఏపీలోనూ ఫామ్-7 వాడి ఓట్లు తీసేయాలని కుట్రలు చేశారని అయితే తాము జాగ్రత్త పడటంతో అందులోంచి బయటపడ్డామని చంద్రబాబు అన్నారు.
అటు వైసీపీ నేతలు విజయసాయిరెడ్డి, బొత్స సత్యనారాయణ, వేమిరెడ్డి తదితరుల బృందం ఈరోజు ఢిల్లీలో సీఈసీని కలిశారు. రాష్ట్రంలో టీడీపీ నేతలు చేస్తున్న దాడులు, ఈవీఎంల భద్రతపై తమకు అనుమానాలున్నాయని.. ఈవీఎంలకు కేంద్ర బలగాలతో రక్షణ కల్పించాలని కోరినట్లు తెలుస్తోంది. ఇక ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ అయితే ఏకంగా ఎన్నికలను రద్దు చేసి బ్యాలెట్ పేపర్స్ ద్వారా ఎన్నికలు నిర్వహించాలని పట్టుబట్టారు.