ఛలో రాజ్‌భవన్..గవర్నర్ వద్దకు జగన్
హైదరాబాద్ : ఏపీలో పోలింగ్ ముగిసింది. పోలిటికల్ వార్ మాత్రం కొనసాగుతూనే ఉంది. విమర్శలు, ప్రతి విమర్శలతో అధికార, ప్రతిపక్షాలు దుమ్మెత్తి పోసుకుంటున్నాయి. ఇప్పటికే చంద్రబాబు హస్తినకు వెళ్లి రాగా..జగన్ గవర్నర్ వద్దకు పంచాయితీ తీసుకెళ్లనున్నారు. టీడీపీ, వైసీపీల మధ్య మాటల వార్ కూడా రోజురోజుకు మరింత ముదిరిపోతోంది. ఇరు పార్టీలు ఎన్నికల సంఘం వద్ద పోటాపోటీగా ఫిర్యాదులు చేశాయి. పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్నాయి. ఎన్నికల సంఘం పనితీరుపై టీడీపీ ఫిర్యాదు చేయగా..ఏపీలో టీడీపీ హింసకు పాల్పడిందని […]
హైదరాబాద్ : ఏపీలో పోలింగ్ ముగిసింది. పోలిటికల్ వార్ మాత్రం కొనసాగుతూనే ఉంది. విమర్శలు, ప్రతి విమర్శలతో అధికార, ప్రతిపక్షాలు దుమ్మెత్తి పోసుకుంటున్నాయి. ఇప్పటికే చంద్రబాబు హస్తినకు వెళ్లి రాగా..జగన్ గవర్నర్ వద్దకు పంచాయితీ తీసుకెళ్లనున్నారు. టీడీపీ, వైసీపీల మధ్య మాటల వార్ కూడా రోజురోజుకు మరింత ముదిరిపోతోంది. ఇరు పార్టీలు ఎన్నికల సంఘం వద్ద పోటాపోటీగా ఫిర్యాదులు చేశాయి. పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్నాయి. ఎన్నికల సంఘం పనితీరుపై టీడీపీ ఫిర్యాదు చేయగా..ఏపీలో టీడీపీ హింసకు పాల్పడిందని వైసీపీ కంప్లైంట్ చేసింది. ఈ క్రమంలో వైసీపీ అధినేత వైఎస్ జగన్ సైతం ఇవాళ గవర్నర్‌ను కలవబోతున్నారు.
ఎన్నికల నేపథ్యంలో జరిగిన ఘటనలపై ఉదయం 11 గంటలకు రాజ్‌భవన్‌లో గవర్నర్‌కు ఫిర్యాదు చేయనున్నారు . శాంతిభద్రతల సమస్యలు తలెత్తేలా ఏపీ సీఎం ప్రవర్తిస్తున్నారని ఫిర్యాదు చేయనున్నారని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. ఏపిలో పోలింగ్ ముగిసిన తర్వాత ఎన్నికల ఏర్పాటు, ఈసీ పనితీరు, ఈవీఎంలపై చంద్రబాబు విమర్శలు గుప్పించారు. ఉద్దేశపూర్వకంగానే ఆయన ఇదంతా చేస్తున్నారని..చంద్రబాబు వ్యాఖ్యలతో శాంతిభద్రతలకు విఘాతం కలిగే అవకాశముందని జగన్ ఫిర్యాదుచేయనున్నట్లు సమాచారం. పార్టీ సీనియర్లు సైతం జగన్ వెంట వెళ్లనున్నారు.