అసలు ఆ దాడులు నిజమేనా?- చంద్రబాబు

ఏపీలో పోలింగ్ ముగిసిన తర్వాత కేంద్రంపై విరుచుకుపడుతున్నారు సీఎం చంద్రబాబు. ఎన్నికల సంఘం పనితీరు, ఈవీఎంల యంత్రాలపై ఢిల్లీ వేదికగా గళం వినిపిస్తున్నారు. విపక్ష నేతలతో కలిసి మోదీ ప్రభుత్వంపై నిర్విరామంగా యుద్ధం చేస్తున్నారు. మోదీ కనుసన్నల్లోనే ఈసీ పనిచేస్తోందని, వ్వవస్థలను పొలిటికల్ బెనిఫిట్స్ కోసం బీజేపీ వాడుకుంటుందని మండిపడుతున్నారు. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వంపై మరో సంచలన ఆరోపణలు చేశారు చంద్రబాబు. మాండ్యాలో కర్నాటక సీఎం కుమారస్వామి కొడుకు నిఖిల్‌కు మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహించిన […]

అసలు ఆ దాడులు నిజమేనా?- చంద్రబాబు
Follow us
Ram Naramaneni

|

Updated on: Apr 16, 2019 | 11:17 AM

ఏపీలో పోలింగ్ ముగిసిన తర్వాత కేంద్రంపై విరుచుకుపడుతున్నారు సీఎం చంద్రబాబు. ఎన్నికల సంఘం పనితీరు, ఈవీఎంల యంత్రాలపై ఢిల్లీ వేదికగా గళం వినిపిస్తున్నారు. విపక్ష నేతలతో కలిసి మోదీ ప్రభుత్వంపై నిర్విరామంగా యుద్ధం చేస్తున్నారు. మోదీ కనుసన్నల్లోనే ఈసీ పనిచేస్తోందని, వ్వవస్థలను పొలిటికల్ బెనిఫిట్స్ కోసం బీజేపీ వాడుకుంటుందని మండిపడుతున్నారు. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వంపై మరో సంచలన ఆరోపణలు చేశారు చంద్రబాబు. మాండ్యాలో కర్నాటక సీఎం కుమారస్వామి కొడుకు నిఖిల్‌కు మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహించిన ఆయన…బాలాకోట్ వైమానిక దాడులపై అనుమానాలు వ్యక్తం చేశారు. పాకిస్తాన్‌లో ఉగ్రవాదులెవరూ చనిపోలేదని..కేంద్రమే డర్టీ పాలిటిక్స్ చేస్తోందని సంచలన వ్యాఖ్యలు చేశారు. దాన్ని తాము ప్రశ్నిస్తే దేశ ద్రోహులని అంటున్నారని తెలిపారు. పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మోదీని పొగిడారు. పాకిస్తాన్ ప్రధాని, ఇండియా ప్రధాని ఒక్కటే. ఇద్దరూ కలిసి డర్టీ పాలిటిక్స్ చేస్తున్నారు. మేమే అసలైన దేశభక్తులం అని చంద్రబాబు వ్యాఖ్యానించారు.

కాగా, ఫిబ్రవరి 14న జరిగిన పుల్వామా ఉగ్రదాడికి ప్రతీకారంగా ఫిబ్రవరి 26న పాకిస్తాన్‌లోని బాలాకోట్‌లో భారత వాయుసేన వైమానిక దాడులు చేసింది. బాంబులతో జైషే మహమ్మద్ ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేసింది. అక్కడ ఎంత మంది చనిపోయారన్న దానిపై స్పష్టత లేకున్నా 250 మందికి పైగా ఉగ్రవాదులు చనిపోయారని కేంద్రం ఇప్పటికే ప్రకటించింది. ఐతే విపక్షాలు మాత్రం బాలాకోట్ ఎయిర్‌స్ట్రైక్స్‌పై అనుమానాలు వ్యక్తంచేస్తున్నాయి. కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ నేతలు మోదీపై తీవ్ర విమర్శలు గుప్పించారు. తాజాగా చంద్రబాబునాయుడు సైతం అదే రకమైన వ్యాఖ్యలు చేయడం హాట్‌టాపిక్‌గా మారింది.