AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నేటి నుంచి వెబ్‌సైట్‌లో.. ఏపీ ఎంసెట్‌ హాల్‌ టికెట్లు

అమరావతి: ఏపీ ఎంసెట్‌ హాల్‌ టికెట్లను మంగళవారం నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని సెట్‌ కన్వీనర్‌ సాయిబాబు తెలిపారు. ఓట్ల లెక్కింపు కేంద్రాలను పలు జిల్లాల్లో ఇంజినీరింగ్‌ కళాశాలల్లో ఏర్పాటు చేసినందున సుమారు 10వేల మంది విద్యార్థులకు వారు ఎంపిక చేసుకున్న 3 ఎగ్జామ్ సెంటర్స్ కాకుండా సమీపంలోని మరో కేంద్రాన్ని కేటాయించామని చెప్పారు. ఇలా కేంద్రాలు మార్చిన విద్యార్థులకు మధ్యాహ్న సెషన్‌లో పరీక్ష రాసే అవకాశం కల్పించామని వివరించారు. హాల్‌ టికెట్ల వెనుక భాగంలో పరీక్షకేంద్రం రూట్‌మ్యాప్‌ […]

నేటి నుంచి వెబ్‌సైట్‌లో.. ఏపీ ఎంసెట్‌ హాల్‌ టికెట్లు
Ram Naramaneni
|

Updated on: Apr 16, 2019 | 9:53 AM

Share

అమరావతి: ఏపీ ఎంసెట్‌ హాల్‌ టికెట్లను మంగళవారం నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని సెట్‌ కన్వీనర్‌ సాయిబాబు తెలిపారు. ఓట్ల లెక్కింపు కేంద్రాలను పలు జిల్లాల్లో ఇంజినీరింగ్‌ కళాశాలల్లో ఏర్పాటు చేసినందున సుమారు 10వేల మంది విద్యార్థులకు వారు ఎంపిక చేసుకున్న 3 ఎగ్జామ్ సెంటర్స్ కాకుండా సమీపంలోని మరో కేంద్రాన్ని కేటాయించామని చెప్పారు. ఇలా కేంద్రాలు మార్చిన విద్యార్థులకు మధ్యాహ్న సెషన్‌లో పరీక్ష రాసే అవకాశం కల్పించామని వివరించారు. హాల్‌ టికెట్ల వెనుక భాగంలో పరీక్షకేంద్రం రూట్‌మ్యాప్‌ ఉంటుంది. తెలంగాణలో పరీక్ష రాసే వారికి హైదరాబాద్‌లోని ఎల్బీనగర్‌, నాచారం, సికింద్రాబాద్‌లలో సెంటర్స్‌ను  కేటాయించారు. • ఇంజినీరింగ్‌ పరీక్ష ఈ నెల 20, 21, 22 తేదీల్లో 2 విడతలు, 23న ఉదయం ఒక విడత నిర్వహిస్తారు. • వ్యవసాయ, వైద్య విభాగ పరీక్షలు 23 మధ్యాహ్నం, 24న 2 విడతలుగా నిర్వహిస్తారు.

ఏపీ ఎంసెట్‌-2019కి దరఖాస్తులు భారీగా వచ్చాయి. ఇప్పటి వరకు దాదాపు 2.83 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఇంజనీరింగ్‌ విభాగానికి 1.96 లక్షల మంది, మెడికల్‌కి 87 వేల మంది అప్లికేషన్‌లు సమర్పించారు. రూ.10 వేల అపరాధ రుసుంతో దరఖాస్తు చేసుకునేందుకు ఈ నెల 19 వరకు అవకాశం ఉంది. ఎంసెట్‌-ఇంజనీరింగ్‌ స్ట్రీమ్‌ పరీక్ష 7 సెషన్లుగా.. అగ్రికల్చర్‌ అండ్‌ మెడికల్‌ స్ట్రీమ్‌ పరీక్ష 3 సెషన్లలో జరగనుంది. పరీక్ష హాలులోకి కాలిక్యులేటర్లు, సెల్‌ఫోన్లు, స్మార్ట్‌ వాచీలు, ఇతర ఎలక్రానిక్ పరికరాలను అనుమతించబోమని, ఒక్క నిమిషం ఆలస్యమైనా పరీక్ష హాలులోకి అనుమతించబోమని కన్వీనర్‌ సాయిబాబు తెలిపారు. ఆన్‌లైన్‌లో జరిగే ఎంసెట్‌పై విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు మాక్‌ టెస్ట్‌లు నిర్వహిస్తామన్నారు.

Follow Us
నాగరికంలో నరరూప రాక్షసులు.. వంశోద్ధారకుడి పిచ్చితో..
నాగరికంలో నరరూప రాక్షసులు.. వంశోద్ధారకుడి పిచ్చితో..
ఇక ఏపీ రాజధానిగా అమరావతి.. గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల
ఇక ఏపీ రాజధానిగా అమరావతి.. గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల
పీరియడ్స్‌తో షూటింగుల్లో ఇబ్బంది పడ్డారా? శ్రీలీల ఆన్సర్ వైరల్
పీరియడ్స్‌తో షూటింగుల్లో ఇబ్బంది పడ్డారా? శ్రీలీల ఆన్సర్ వైరల్
గంటకు 154.7 కిమీల వేగంతో బౌలింగ్.. అసలు సీక్రెట్ ఇదే..!
గంటకు 154.7 కిమీల వేగంతో బౌలింగ్.. అసలు సీక్రెట్ ఇదే..!
రూ. 339 కే నెలంతా అపరిమిత సేవలు.. రూ.35,000 విలువైన జెమిని ప్రో
రూ. 339 కే నెలంతా అపరిమిత సేవలు.. రూ.35,000 విలువైన జెమిని ప్రో
శాంసన్, గైక్వాడ్ కాదు.. CSK పాలిట విలన్ ఇతనే..!
శాంసన్, గైక్వాడ్ కాదు.. CSK పాలిట విలన్ ఇతనే..!
గ్యాస్ స్టవ్‌లో చిన్న మంట వస్తోందా.? చిటికెలో ఇలా సులభంగా..
గ్యాస్ స్టవ్‌లో చిన్న మంట వస్తోందా.? చిటికెలో ఇలా సులభంగా..
ఎంత ఉతికినా కిచెన్ టవల్స్‌ జిడ్డు వదలట్లేదా.. ఇలా ట్రై చేయండి
ఎంత ఉతికినా కిచెన్ టవల్స్‌ జిడ్డు వదలట్లేదా.. ఇలా ట్రై చేయండి
సినిమాల్లోకి దేవయాని కూతురు.. 'కోర్ట్' రీమేక్‌తో ఎంట్రీ.. వీడియో
సినిమాల్లోకి దేవయాని కూతురు.. 'కోర్ట్' రీమేక్‌తో ఎంట్రీ.. వీడియో
14 మ్యాచ్‌లలో 6సార్లు జీరోకే.. తలనొప్పిలా మారిన కాటేరమ్మకొడుకు
14 మ్యాచ్‌లలో 6సార్లు జీరోకే.. తలనొప్పిలా మారిన కాటేరమ్మకొడుకు