మాజీ ఎమ్మెల్యేలకు బంపర్ ఆఫర్ ఇచ్చిన కేసీఆర్
హైదరాబాద్ : ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన ఎమ్మెల్యేలకు.. సీఎం కేసీఆర్ జడ్పీ చైర్‌పర్సన్ పదవుల ఆఫర్ ఇచ్చారు. ఇవాళ స్థానిక సంస్థల ఎన్నికలపై తెలంగాణ భవన్‌లో పార్టీ విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై ఆయన పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. మొత్తం 32 జిల్లా పరిషత్‌లను టీఆర్ఎస్ దక్కించుకునేలా పనిచేయాలని సూచించారు. ఇక, అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిన వారికి జిల్లా పరిషత్ చైర్ పర్సన్‌లుగా అవకాశం ఇస్తామని కేసీఆర్ తెలిపారు. […]
హైదరాబాద్ : ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన ఎమ్మెల్యేలకు.. సీఎం కేసీఆర్ జడ్పీ చైర్‌పర్సన్ పదవుల ఆఫర్ ఇచ్చారు. ఇవాళ స్థానిక సంస్థల ఎన్నికలపై తెలంగాణ భవన్‌లో పార్టీ విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై ఆయన పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. మొత్తం 32 జిల్లా పరిషత్‌లను టీఆర్ఎస్ దక్కించుకునేలా పనిచేయాలని సూచించారు. ఇక, అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిన వారికి జిల్లా పరిషత్ చైర్ పర్సన్‌లుగా అవకాశం ఇస్తామని కేసీఆర్ తెలిపారు. ఇందుకుగానూ అసిఫాబాద్ జిల్లా పరిషత్ చైర్‌పర్సన్‌గా మాజీ ఎమ్మెల్యే కోవా లక్ష్మీ పేరును ఆయన ప్రకటించారు. ఇక పెద్దపల్లి జెడ్పీ చైర్మన్‌గా ఇటీవల మంథని నుంచి ఓడిన మాజీ ఎమ్మెల్యే పుట్టా మధు పేరును ఖరారు చేశారు. ఇక పార్టీ ప్రధాన కార్యదర్శులకు కూడా జిల్లాల బాధ్యతలను అప్పగించనుండగా జెడ్పీలను గెలిపించే బాధ్యత ఎమ్మెల్యేలకు, మంత్రులకు అప్పగించారు. జెడ్పీల ఎంపిక నుండి గెలుపు వరకు ఎమ్మెల్యేలు మంత్రులు, ఇంఛార్జులను సమన్వయం చేసుకుంటూ వెళ్లాలని కేసీఆర్ ఆదేశించారు.