Eating Mealworm: పురుగును తినడానికి అనుమతించిన యూరోపియన్ యూనియన్.. ఇకపై భోజనంగా మీల్ వార్మ్స్..
EU Green Signal To Eating Mealworm: దేశ ప్రజల ఆహార విషయంలో యూరోపియన్ యూనియన్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ఈయూ సభ్య దేశాల్లో పసుపు రంగులో ఉండే..
EU Green Signal To Eating Mealworm: దేశ ప్రజల ఆహార విషయంలో యూరోపియన్ యూనియన్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ఈయూ సభ్య దేశాల్లో పసుపు రంగులో ఉండే మీల్ వార్మ్స్‌ను ప్రజలు ఆహారంగా తీసుకోవడానికి అనుమతులిచ్చింది. ఈయూ సభ్య దేశాల్లో ఒక పురుగును ఆహారంగా తినేందుకు అనుమతి ఇవ్వడం ఇదేతొలిసారి కావడం గమనార్హం. ఇదిలా ఉంటే ఈ మీల్ వార్మ్స్‌లో ప్రోటీన్‌లు, కొవ్వు, ఫైబర్ అధికంగా ఉన్నాయని యూరోపియన్ యూనియన్ ఫుడ్ సెఫ్టీ ఏజేన్సీ తెలిపింది. దీంతో ఇప్పటి వరకు పెంపుడు జంతువులకు ఆహారంగా పెడుతూ వచ్చిన ఈ మీల్ వార్మ్స్ ప్రజల మెనూలో భాగం కానుంది. అయితే ఈ మీల్ వార్మ్స్‌ను ఆహారంగా తీసుకోవడం వల్ల అందరికీ మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా డస్ట్ అలర్జీతో బాధపడేవారు వీటిని తీసుకోకూడదని సూచిస్తున్నారు.