మీరు ఉద్యోగస్తులా.. మీకు పీఎఫ్ కట్ అవుతోందా.. ఈపీఎఫ్ మీ కోసం ఈ సర్వీసును తీసుకొచ్చింది..
మీరు ప్రభుత్వ ఉద్యోగులు, ప్రైవేట్ ఉద్యోగులా.. మీకు ఈపీఎఫ్ఓ కట్ అవుతోందా.. మీ అకౌంట్ లో బ్యాలెన్స్ ఎంత ఉంది. ఇప్పటి వరకు మీకు జమ అయిన పీఎఫ్ అమౌంట్ ఎంతో తెలుసుకోవాలని ఉందా..

మీరు ప్రభుత్వ ఉద్యోగులు, ప్రైవేట్ ఉద్యోగులా.. మీకు ఈపీఎఫ్ఓ కట్ అవుతోందా.. మీ అకౌంట్ లో బ్యాలెన్స్ ఎంత ఉంది. ఇప్పటి వరకు మీకు జమ అయిన పీఎఫ్ అమౌంట్ ఎంతో తెలుసుకోవాలని ఉందా.. మీ కోసమే ఈపీఎఫ్ ఇటీవల వాట్సాప్ హెల్ప్ లైన్ ను ప్రారంభించింది. తెలుగు రాష్ట్రాలకు చెందిన ఈపీఎఫ్ సబ్‌స్క్రైబర్లు సంప్రదించాల్సిన వాట్సప్ నెంబర్లు మీ కోసం.
వేరు వేరు ప్రాంతాలకు వేరు వేరు నెంబర్లు..
ఈపీఎఫ్ ఇటీవల కొత్తగా వాట్సాప్ హెల్ప్‌లైన్ సర్వీస్ ప్రారంభించింది. అయితే ఒకే హెల్ప్‌లైన్ నెంబర్ ఉన్నట్టు ఒకే వాట్సప్ నెంబర్ ఉండదు. ప్రాంతాలను బట్టి వాట్సప్ నెంబర్లు మారుతుంటాయి. అంటే తెలుగు రాష్ట్రాల్లో చూస్తే హైదరాబాద్, కరీంనగర్, నిజామాబాద్, వరంగల్, విశాఖపట్నం, గుంటూరు, కడప, రాజమండ్రి ప్రాంతాలకు వేర్వేరు వాట్సాప్ నెంబర్స్ ఉంటాయి. జోనల్ ఆఫీస్‌లోని రీజనల్ ఆఫీసులకు ప్రత్యేకంగా ఈ వాట్సప్ నెంబర్స్ ఉంటాయి. కాబట్టి ఆయా రీజనల్ ఆఫీస్‌లో ఈపీఎఫ్ అకౌంట్ ఉన్నవారు సంబంధిత నెంబర్లను మాత్రమే వాట్సప్‌లో సంప్రదించాల్సి ఉంటుంది.
తెలంగాణకు సంబంధించిన నెంబర్లు..
తెలంగాణలోని హైదరాబాద్ జోనల్ ఆఫీస్ పరిధిలో చూస్తే హైదరాబాద్ (బర్కత్‌పుర)- 9100026170, హైదరాబాద్ (మాదాపూర్)- 9100026146, కరీంనగర్- 9492429685, కూకట్‌పల్లి- 9392369549, నిజామాబాద్- 8919090653, పటాన్‌చెరు- 9494182174, సిద్దిపేట్- 9603262989, వరంగల్- 8702447772 నెంబర్లను సంప్రదించొచ్చు.
ఆంధ్రప్రదేశ్ కు సంబంధించిన నెంబర్లు..
ఆంధ్రప్రదేశ్- విజయవాడ జోనల్ ఆఫీస్ పరిధిలో చూస్తే గుంటూరు- 0863-2344123, కడప- 9491138297, రాజమండ్రి- 9494633563, విశాఖపట్నం 7382396602 నెంబర్లలో సంప్రదించాలి.