ఆఫర్లతో కుమ్మేస్తున్న ఫ్లిప్‌కార్ట్.. ఫ్లిప్‌స్టార్ట్ డేస్ సేల్ పేరుతో పలు డిస్కౌంట్ల ప్రకటన.. ఎలక్ట్రానిక్ ఉపకరణాలపై 80 శాతం తగ్గింపు..
పండుగలు, సెలవులు వచ్చాయంటే చాలు ఈ కామర్స్ సంస్థలు ఆఫర్లను ప్రకటిస్తూ ఉంటాయి. తగ్గింపు ధరలతో వినియోగదారులను ఆకట్టుకోవడానికి ప్రయత్నిస్తాయి.
Flipkart offers: పండుగలు, సెలవులు వచ్చాయంటే చాలు ఈ కామర్స్ సంస్థలు ఆఫర్లను ప్రకటిస్తూ ఉంటాయి. తగ్గింపు ధరలతో వినియోగదారులను ఆకట్టుకోవడానికి ప్రయత్నిస్తాయి. తాజాగా ప్రముఖ ఈ కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ మరోసారి ఆఫర్లను ప్రకటించింది. డిసెంబర్ 1 నుంచి ఎలక్ట్రానిక్ ఉపకరణాలపై 80 శాతం తగ్గింపును అందిస్తోంది. ఫ్లిప్‌స్టార్ట్ డేస్ సేల్ పేరుతో బంపర్ ఆఫర్లు, డిస్కౌంట్లను అందిస్తోంది. ఆన్‌లైన్‌లో ఫ్లిప్‌కార్ట్.కామ్‌లో ఈ సేల్ అందుబాటులో ఉంటుంది.
తాజా ఆఫర్ల ప్రకారం టీవీలు, ఏసీలు రిఫ్రిజిరేటర్లలో 50 శాతం వరకు తగ్గింపును ఇస్తోంది. బ్యూటీ, క్రీడలు, ఫర్నిచర్, గృహాలంకరణ ఇతర ఉత్పత్తులపై డిస్కౌంట్, ఆఫర్లను ప్రకటించింది. పాదరక్షలు, బట్టలు, క్రీడా పరికరాలు, ఫర్నిచర్, గృహాలంకరణ తదితర ఉత్పత్తులపై కూడా తగ్గింపును ప్రకటించింది. హెడ్‌ఫోన్‌లు, స్పీకర్లపై 70శాతం వరకు తగ్గింపును అందిస్తోంది. ల్యాప్‌టాప్‌లపై 30శాతం డిస్కౌంట్ అందుబాటులో ఉంటుంది. అలాగే స్మార్ట్‌వాచ్‌లు, ఫిట్‌నెస్ బ్యాండ్‌లాంటిపై కూడా తగ్గింపులో ధరల్లో అందిస్తోంది. దీంతోపాటు నోకాస్ట్ ఈఎంఐ సదుపాయం, ఎక్స్ఛేంజ్ ఆఫర్లు, వారంటీ పొడగింపు వంటి సదుపాయం కూడా ఉంది.