టాప్ లఘు చిత్రాలతో పోటీపడి లైవ్ యాక్షన్ షార్ట్ ఫిల్మ్ విభాగంలో ఆస్కార్ కు ఎంపికైన ‘షేమ్ లెస్’..
లైవ్ యాక్షన్ షార్ట్ ఫిల్మ్ విభాగంలో సయాని గుప్తా- హుస్సేన్ దలాల్- రిషబ్ కపూర్ నటించిన లఘు చిత్రం`షేమ్ లెస్` ఆస్కార్ 2021 కు భారత్ నుంచి అధికారికంగా ఖాయమైందని తెలుస్తుంది.
లైవ్ యాక్షన్ షార్ట్ ఫిల్మ్ విభాగంలో సయాని గుప్తా- హుస్సేన్ దలాల్- రిషబ్ కపూర్ నటించిన లఘు చిత్రం`షేమ్ లెస్` ఆస్కార్ 2021 కు భారత్ నుంచి అధికారికంగా ఖాయమైందని తెలుస్తుంది. ‘షేమ్ లెస్’ లఘు చిత్రం గత ఏడాది ఏప్రిల్ లో విడుదలైంది. కీత్ గోమ్స్ దర్శకత్వంలో ఈ షార్ట్ ఫిలిం తెరకెక్కింది.
ఈ లఘు చిత్రం ఆస్కార్ కు ఎంపిక అవ్వడం పై కీత్ గోమ్స్ ఆనందాన్ని వ్యక్తం చేసారు. ఈ సందర్భంగా చిత్రయూనిట్ కు కృతజ్ఞతలు తెలిపారు. కుటుంబసభ్యులనుంచి, స్నేహితులనుంచి తీసుకున్న కొద్దిపాటి డబ్బులతోనే ఈ షార్ట్ ఫిలిం తెరకెక్కించానని, ఈ చిత్రం కోసం ప్రతి ఒక్కరూ చాలా ప్రేమపూర్వకంగా పనిచేశారని కీత్ గోమ్స్ ఎమోషనల్ అయ్యారు. ఇక ‘షేమ్ లెస్’ చిత్రం షాన్ వ్యాస్`నాట్ కథ్`,ఆదిత్య కెల్గావ్కర్ `సౌండ్ ప్రూఫ్`, సఫర్ .. ట్రాప్డ్ లాంటి టాప్ లఘు చిత్రాలతో పోటీపడి ఆస్కార్ కు ఎంపికైంది.