కేంద్రం కీలక నిర్ణయం, స్థానిక భాషల్లో ఇంజనీరింగ్ కోర్సులు, వచ్చే అకడమిక్ ఇయర్ నుంచే
వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి ఇంజనీరింగ్ ప్రోగ్రామ్స్ సహా టెక్నికల్ కోర్సులు మాతృ భాషల్లో నేర్చుకునే వీలు కల్పించనున్నట్లు విద్యాశాఖ వర్గాలు వెల్లడించాయి.
వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి ఇంజనీరింగ్ ప్రోగ్రామ్స్ సహా టెక్నికల్ కోర్సులు మాతృ భాషల్లో నేర్చుకునే వీలు కల్పించనున్నట్లు విద్యాశాఖ వర్గాలు వెల్లడించాయి. కేంద్ర విద్యా మంత్రి రమేశ్ పొఖ్రియాల్ ఆధ్వర్యంలో నిర్వహించిన రివ్యూ మీటింగ్‌లో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. వచ్చే విద్యాసంవత్సరం నుంచి ఈ నిబంధన అమల్లోకి రానుందని, ఇందుకోసం కొన్ని ఐఐటీ, ఎన్‌ఐటీలను ఎంపిక చేస్తామని విద్యాశాఖ వర్గాలు వివరించాయి. స్కాలర్‌షిప్పులు, ఫెలోషిప్పులు సమయానికి స్టూడెంట్సుకు అందించాలని, ఇందుకు సంబంధించిన కంప్లైంటులు పరిష్కారానికి ఒక హెల్ప్‌లైన్ ఏర్పాటు చేయాలని యూజీసీకి సమావేశంలో సూచించారు.
అయితే టెక్నికల్ కోర్సులను ఇంగ్లీషులో కాకుండా స్థానిక భాషల్లో బోధించడం సవాల్‌తో కూడుకున్న పని అని విద్యావేత్తలు అభిప్రాయపడుతున్నారు. వచ్చే అకడమిక్ ఇయర్ అతి సమీపంలో ఉన్న నేపథ్యంలో ఈ నిర్ణయం కత్తి మీద సామే అన్నది వారి విశ్లేషణ. ఇందుకోసం మాతృభాషల్లో ఇంజనీరింగ్ సిలబస్‌కు తగిన పుస్తకాలు, స్టడీ మెటీరియల్ అందుబాటులోకి తీసుకురావాలని..సిబ్బందికి కూడా కూడా శిక్షణ ఇవ్వాలని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
Also Read :
నేడు ఏపీ కేబినెట్ భేటీ, సభలో పెట్టే బిల్లులపై చర్చ, పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీపై కీలక నిర్ణయం
పటాన్చెరు మండలంలో కలకలం..శాంపిల్ క్షిపణి మిస్ ఫైర్.. భయాందోళనకు గురైన స్థానికులు..
ఏపీలో 53 మంది మహిళా జీవిత ఖైదీల విడుదలకు ఉత్తర్వులు, అలా చేస్తే ఆర్డర్స్ రద్దు