Electric Vehicles: అక్టోబర్‌లో రికార్డు స్థాయిలో ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలు.. ఎన్ని అంటే..
Electric Vehicles: గత నెలలో భారత మార్కెట్లో 10,609 ఎలక్ట్రిక్ కార్లు అమ్ముడయ్యాయి. అక్టోబర్ 2023లో 7626 యూనిట్ల కంటే ఇది 39 శాతం ఎక్కువ..
ఎలక్ట్రిక్ వాహనాలు భారత మార్కెట్లో తమదైన ముద్ర వేయటం ప్రారంభించాయి. గత అక్టోబర్‌లో పండుగ సీజన్‌లో ఎలక్ట్రిక్ వాహనాలు రికార్డు స్థాయిలో అమ్మకాలు జరిగాయి. ఎలక్ట్రిక్ స్కూటర్ లేదా మోటార్ సైకిల్, ఎలక్ట్రిక్ కార్ లేదా ట్రైసైకిల్, ఎలక్ట్రిక్ కమర్షియల్ బ్యాటరీతో నడిచే వాహనాలు విస్తృతంగా కొనుగోలు చేస్తున్నారు. అందుకే గత నెలలో దాదాపు 2.18 లక్షల ఎలక్ట్రిక్ వాహనాలు అమ్ముడయ్యాయి.
గత నెలలో 1.39 లక్షల ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలు అమ్మకాలు:
అక్టోబర్ 2024లో, భారతదేశంలో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల విభాగంలో 1,39,159 వాహనాలు విక్రయాలు జరిగాయి. ఏడాది క్రితం అక్టోబర్ 2023లో విక్రయించిన 75,165 యూనిట్లతో పోలిస్తే ఇది 85 శాతం పెరిగింది. అదే సమయంలో సెప్టెంబర్ 2024లో భారత మార్కెట్లో 90 వేల ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలు విక్రయించారు. అంటే వారి విక్రయాల్లో నెలవారీ 55 శాతం పెరుగుదల. Ola Electric, TVS, Bajaj, Ather Energy, Hero Vida భారతదేశంలో అత్యధిక సంఖ్యలో ఎలక్ట్రిక్ స్కూటర్లను విక్రయిస్తున్నాయి కంపెనీలు.
అక్టోబర్‌లో 67 వేల ఎలక్ట్రిక్ 3-వీలర్లు :
గత నెలలో పండుగ సీజన్‌లో భారత మార్కెట్లో 67,171 ఎలక్ట్రిక్ త్రీ-వీలర్లు అమ్ముడయ్యాయి. ఇది ఏటా దాదాపు 18 శాతం పెరగడం గమనార్హం. అదే సమయంలో, నెలవారీ అమ్మకాలు దాదాపు 7 శాతం పెరిగాయి. ఈ ఏడాది సెప్టెంబర్‌లో 62,899 ఎలక్ట్రిక్ త్రీ-వీలర్లు విక్రయించబడ్డాయి.
అక్టోబర్‌లో 865 ఎలక్ట్రిక్ గూడ్స్ వాహనాల అమ్మకాలు:
గత అక్టోబర్‌లో భారతదేశంలో 864 ఎలక్ట్రిక్ వాణిజ్య వాహనాలు విక్రయాలు జరిగాయి. ఇది ఏటా 50 శాతం పెరుగుదల. అదే సమయంలో, నెలవారీ అమ్మకాలు 1 శాతం పెరిగాయి.
గత నెలలో 10,000 పైగా ఎలక్ట్రిక్ కార్లు అమ్ముడయ్యాయి:
గత నెలలో భారత మార్కెట్లో 10,609 ఎలక్ట్రిక్ కార్లు అమ్ముడయ్యాయి. అక్టోబర్ 2023లో 7626 యూనిట్ల కంటే ఇది 39 శాతం ఎక్కువ. అదే సమయంలో సెప్టెంబర్‌లో కేవలం 5,873 ఎలక్ట్రిక్ కార్లు విక్రయించగా, గత నెలలో ఎలక్ట్రిక్ కార్ల అమ్మకాలు దాదాపు 81 శాతం పెరిగాయి.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి