మారుతి సుజుకీ డిజైర్ 2024 కారును మార్కెట్లోకి తీసుకొచ్చింది. ఈ కారు నాలుగో తరం ప్రారంభ ధర రూ. 6.79 లక్షలుగా నిర్ణయించారు.
ఈ కారుకు ఇటీవల గ్లోబల్ ఎన్‌క్యాప్ నుంచి 5 స్టార్ రేటింగ్ లభించింది. మారుతి సుజుకీ నుంచి 5 స్టార్ రేటింగ్ సాధించిన తొలి కారుగా ఇది నిలిచింది.
ఈ కారుకు సంబంధించి ఇప్పటికే బుకింగ్స్ ప్రారంభమమయ్యాయి. ఫీచర్ల విషయానికొస్తే ఇందులో స్లీక్ ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్‌ను ఇచ్చారు.
డీఆర్‌ఎల్, టర్న్ ఇండికేటర్ల ఇంటిగ్రేషన్‌తో ఈ కారును డిజైన్ చేశారు. డైమండ్ కట్ అలాయ్ వీల్స్, వై ఆకారంలో ఎల్‌ఈడీతో కూడిన టెయిల్ ల్యాంప్‌ను అందించారు.
ఇక ఇంటీరియర్ విషయానికొస్తే ఇందులో.. 9 ఇంచెస్ ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్ ఇచ్చారు. ఇది యాపిల్ కార్‌ప్లే, ఆండ్రాయిడ్ ఆటోకు సపోర్ట్ చేస్తుంది.
ఆర్కామిస్ సౌండ్ సిస్టమ్‌ను ఇచ్చారు. ఇందులో క్రూయిజ్ కంట్రోల్, రియర్ డీఫాగర్, టైప్-సి ఛార్జింగ్ పోర్ట్స్ వంటి ఫీచర్లను అందించారు. ఫ్యాక్టరీ ఫిటెడ్ సన్‌రూఫ్, క్రూయిజ్ కంట్రోల్‌ను అందించారు.
ఇక ఈ కారులో రియర్ ఏసీ వెంట్స్ వంటి ఫీచర్లను తొలిసారిగా ఇచ్చారు. హై ఎండ్ మోడళ్లలో 360 డిగ్రీల కెమెరా కూడా ఇచ్చారు. ఇందులో మారుతీ జెడ్ సిరీస్ 1.2 లీటర్ త్రీ సిలిండర్ పెట్రోల్ ఇంజిన్ ఇచ్చారు.