AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gujarat: గుజరాత్ దగ్గర సముద్ర జలాల్లో అనుమానాస్పద నౌక.. భారత ఫోర్స్ వెళ్లి తనిఖీ చేయగా

ఇండియన్ నేవీ సహకారంతో సముద్ర జలాల్లో సరికొత్త ఆపరేషన్ చేపట్టింది NCB. అంతర్జాతీయ డ్రగ్స్ మాఫియా ఆటకట్టించింది. గుజరాత్ పోర్‌బందర్‌ దగ్గర ఇరాన్‌ నుంచి వచ్చిన 700 కిలోల డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకుంది.

Gujarat: గుజరాత్ దగ్గర సముద్ర జలాల్లో అనుమానాస్పద నౌక.. భారత ఫోర్స్ వెళ్లి తనిఖీ చేయగా
Drug Bust
Ram Naramaneni
|

Updated on: Nov 15, 2024 | 9:47 PM

Share

విదేశాల నుంచి భారత్‌కు భారీగా డ్రగ్స్‌ తరలిస్తోంది ఇంటర్నేషనల్ డ్రగ్స్‌ ముఠా. ఇటీవల సముద్ర జలాల ద్వారా డ్రగ్స్‌ ఎక్కువగా తరలిస్తోంది. దీంతో కేంద్రం సముద్రంలో ఉండగానే డ్రగ్స్‌ను పట్టుకునేలా టీమ్‌ను ఏర్పాటు చేసింది. ఇండియన్ నేవీ, NCB, యాంటీ టెర్రరిస్ట్‌ స్క్వాడ్‌ సంయుక్తంగా ఆపరేషన్స్‌లో పాల్గొంటాయి.

గుజరాత్ దగ్గర సముద్ర జలాల్లో అనుమానాస్పద నౌక తిరుగుతుందని అధికారులకు సమాచారం వచ్చింది. దీంతో సాగర్ మంథన్‌ కోడ్‌ -ఫోర్ పేరుతో ఆపరేషన్ చేపట్టారు అధికారులు. పోర్ బందర్ దగ్గర సముద్ర తీరంలో నౌకను నిలిపివేసి తనిఖీలు చేపట్టారు అధికారులు. ఇండియన్ నేవీ, ఏటీఎస్‌, ఎన్‌సీబీ అధికారులు నౌకలో తనిఖీలు చేశారు. ఆ నౌక నుంచి 700 కిలోల డగ్స్‌ స్వాధీనం చేసుకున్నారు. 8 మందిని అరెస్ట్ చేశారు. విచారణలో తాము ఇరాన్ పౌరులమని.. ఆ నౌక ఇరాన్‌కు చెందిందని తెలిపారు స్మగ్లర్లు.

పట్టుబడ్డ డ్రగ్స్‌ మెత్‌గా పిలిచే మెథం ఫెటమైన్‌గా గుర్తించారు అధికారులు. ఈ డ్రగ్స్ విలువ మార్కెట్‌లో రెండు కోట్ల నుంచి ఐదు కోట్ల వరకు ఉంటుందని తెలిపారు ఎన్సీబీ అధికారులు. ఈ డ్రగ్స్‌ను ఎక్కడికి తరలిస్తున్నారు. ఎవరికి సరఫరా చేసేందుకు తీసుకువచ్చారన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.

గుజరాత్‌లో పట్టుకున్న డ్రగ్స్‌ వివరాలను తెలుపుతూ కేంద్రానికి లేఖరాశారు అధికారులు. 2047 నాటికి డ్రగ్స్ రహిత దేశంగా భారత్‌ను తీర్చిదిద్దాలని లక్ష్యంగా పెట్టుకున్న కేంద్రం ఆలోచనలకు అనుగుణంగా తాము పనిచేస్తున్నామని లేఖలో తెలిపారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.

Follow Us
ఉదయాన్నే ఖాళీ కడుపుతో వెల్లుల్లి తింటే శరీరంలో ఏం జరుగుతుందో తెలు
ఉదయాన్నే ఖాళీ కడుపుతో వెల్లుల్లి తింటే శరీరంలో ఏం జరుగుతుందో తెలు
బిగ్ బాస్ 10లోకి క్రేజీ బ్యూటీ..
బిగ్ బాస్ 10లోకి క్రేజీ బ్యూటీ..
బంగారం లాంటి వార్త.. మరింత తగ్గిన గోల్డ్, సిల్వర్ రేట్స్!
బంగారం లాంటి వార్త.. మరింత తగ్గిన గోల్డ్, సిల్వర్ రేట్స్!
శుక్రుడి మహా ప్రభావం.. ఈ 4 రాశుల వారికి డబ్బు, పదోన్నతి, అదృష్టం
శుక్రుడి మహా ప్రభావం.. ఈ 4 రాశుల వారికి డబ్బు, పదోన్నతి, అదృష్టం
మంగళవారం.. ఈ ఒక్క పరిహారం చేస్తే హనుమంతుడి అనుగ్రహం, కుజ దోషాలు..
మంగళవారం.. ఈ ఒక్క పరిహారం చేస్తే హనుమంతుడి అనుగ్రహం, కుజ దోషాలు..
జూన్ 9 రాశిఫలాలు:వారికి ఆర్థిక లాభాలు, అన్ని ప్రయత్నాల్లో సక్సెస్
జూన్ 9 రాశిఫలాలు:వారికి ఆర్థిక లాభాలు, అన్ని ప్రయత్నాల్లో సక్సెస్
ఉదయాన్నే కీళ్లు బిగుసుకుపోతున్నాయా? ఆర్థరైటిస్ సహా ఈ ప్రమాదకర..
ఉదయాన్నే కీళ్లు బిగుసుకుపోతున్నాయా? ఆర్థరైటిస్ సహా ఈ ప్రమాదకర..
ఎండిన తులసిని పారేయొద్దు.. ఇలా చేస్తే ఇంటికి శుభం, ఐశ్వర్యం ..
ఎండిన తులసిని పారేయొద్దు.. ఇలా చేస్తే ఇంటికి శుభం, ఐశ్వర్యం ..
ఇంట్లో పిల్లిని పెంచుకుంటే అదృష్టమా? దురదృష్టమా? వాస్తు శాస్త్రం
ఇంట్లో పిల్లిని పెంచుకుంటే అదృష్టమా? దురదృష్టమా? వాస్తు శాస్త్రం
కోట్ల విలువైన వాచీలు, చెయిన్లు.. ఫ్యాషన్ క్రికెటర్‌‌
కోట్ల విలువైన వాచీలు, చెయిన్లు.. ఫ్యాషన్ క్రికెటర్‌‌