గోల్డ్ లవర్స్‌కి గుడ్ న్యూస్.. గతవారం రోజులుగా బంగారం ధరలు భారీగా తగ్గుతున్నాయి. డాలర్ బలపడటంతో గత ఐదు నెలలలో తొలిసారిగా గోల్డ్ ధరలు దిగోచ్చాయి.
అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ విజయం, యూఎస్ వడ్డీ రేట్లపై ఎన్నికల ప్రభావం పడటంతో గోల్డ్ సెంటిమెంట్ బలహీనపడింది. ఇక దీనితో బులియన్ మార్కెట్‌లో గత వారం దాదాపు 2 శాతం క్షీణించింది పుత్తడి ధర
ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్‌లో గోల్డ్ ఫీచర్ ఔన్స్ బంగారం ధర 2,684 డాలర్లుగా పలుకుతోంది. గత గురువారం యూఎస్ ఫెడ్ వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించినప్పటికీ.. ఆ ప్రభావం గోల్డ్‌పై నామమాత్రంగానే పడింది.
రాబోయే నాలుగు నెలల్లో గోల్డ్ రేటు మరింత క్షీణించే అవకాశం ఉందని ఎనలిస్టులు అంచనా వేస్తున్నారు. ఇంటర్నేషనల్ ఎనలిస్టుల ప్రకారం గోల్డ్ రేట్లు ఇప్పుడున్న స్థాయి నుంచి ఏకంగా 20 శాతం క్షీణించే అవకాశం ఉందని అంటున్నారు.
వారు చెబుతున్న లెక్క ప్రకారం గోల్డ్ రేట్ రూ. 60 వేలకు చేరుకుందట. కానీ దేశీయ ఎనలిస్టులు దీనికి భిన్నంగా రెస్పాండ్ అయ్యారు. గోల్డ్ ధరల్లో తగ్గింపు ఉండొచ్చు గానీ మరీ ఇంతలా భారీగా పడవని వారు తెలిపారు.